నాగ్ కొత్త సినిమా బ్యాక్‌డ్రాప్ ఇదేనట..!

అక్కినేని నాగార్జున గతకొంత కాలంగా నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బిచాణా ఎత్తేస్తుండటంతో ఆయన ఈసారి ఎలాగైనా అదిరిపోయే సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.ఈ క్రమంలో ఓ కాప్ థ్రిల్లర్ మూవీలో నాగ్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

 Nagarjuna Praveen Sattaru Movie Backdrop, Nagarjuna, Praveen Sattaru, Wild Dog,-TeluguStop.com

‘వైల్డ్ డాగ్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు.ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే నాగ్ తన నెక్ట్స్ మూవీని యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.ఈ సినిమాలో నాగ్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

కాగా తాజాగా ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ ఇదేనంటూ చిత్ర వర్గాల్లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.ఈ సినిమా కథ పూర్తిగా యాంగర్ మేనేజ్‌మెంట్‌పై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో నాగ్ అతికోపం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందా అనే కథతో సాగుతుందని తెలుస్తోంది.బాధ్యతగల పదవిలో ఉన్న నాగ్, తన కోపం కారణంగా పలు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటాడు.

వాటిని ఆయన ఎలా పరిష్కరిస్తాడు, తన పంథాను ఎలా మార్చుకుంటాడు అనేది సినిమా కథగా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఇక కరోనా ప్రభావం తగ్గగానే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

మరి ఈ సినిమాతో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube