తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మరో ఒటీటీ

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ యుగం నడుస్తుంది.ఎంటర్టైన్మెంట్ కూడా డిజిటల్ లోకి వచ్చేసింది.

 Nagarjuna Plan Ott From Annapurna Studios , Tollywood, Aha Ott Platform, Telugu-TeluguStop.com

ఒకప్పుడు వీధి నాటకాలతో స్టార్ట్ అయిన ఎంటర్టైన్మెంట్ తరువాత రేడియోలకి వచ్చింది .తరువాత దృశ్యరూపంలో సినిమాలుగా రూపాంతరం చెందింది.ఈ సినిమాల హవా ప్రస్తుతం నడుస్తుంది.మరోవైపు టెలివిజన్ ప్రతి ఇంట్లోకి వచ్చేసింది.వాటిలో సీరియల్స్, రియాలిటీ షోల ద్వారా కొత్తరకం ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయ్యింది.ఇప్పుడు ఇది కాస్తా అప్ గ్రేడ్ అయ్యి వెబ్ సిరీస్, షార్ట్ మూవీస్ తో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయ్యింది.

ప్రస్తుతం మంది ప్రేక్షకులు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కి అలవాటు పడ్డారు.ఏ మార్కెట్ ని క్యాపచ్యూర్ చేసుకోవడానికి ఒటీటీ చానల్స్ స్టార్ట్ అయ్యాయి.

యుట్యూబ్ తరహాలో చాలా వీడియో చానల్స్ ఇప్పుడు పుట్టుకొచ్చాయి.వీటికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది.

ఇక తెలుగులో కూడా ఎంటర్టైన్మెంట్ కి మార్కెట్ కి మంచి బిజినెస్ ఉండటంతో అల్లు అరవింద్ ముందుగా మేల్కొని కొంత మంది పార్ట్ నర్స్ తో కలిసి ఆహ స్టార్ట్ చేశారు.ప్రస్తుతం ఇది సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

చిన్న సినిమాలకి ఆహ కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది.మరో వైపు దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో థియేటర్స్ కి వెళ్ళే ప్రేక్షకులు తగ్గిపోయారు.భవిష్యత్తులో భౌతిక దూరం తప్పనిసరి అనే నిబంధన వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో థియేటర్స్ కి డిమాండ్ మరింత తగ్గిపోయే అవకాశం ఉంది.అప్పుడు ప్రత్యామ్నాయం అంటే ఒటీటీ చానల్స్ మాత్రమే.

ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ మొత్తం సినిమాలు చూసే అవకాశం ఉండటంతో వాటివైపే జనం మొగ్గు చూపిస్తున్నారు.ఈ నేపధ్యంలో టాలీవుడ్ లో మరో బడా నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఒటీటీ బిజినెస్ లోకి దిగుతుంది.

కింగ్ నాగార్జున ఇప్పటికే దీనికి సంబంధించి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.తన వ్యాపార భాగస్వామిలతో కలిసి ఈ ఒటీటీ చానల్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.

తెలుగులో ఆహ కాకుండా మరికొన్ని ఒటీటీ చానల్స్ ఉన్న వాటికి అంత ఆదరణ లేదు.మరి నాగార్జున తన సంస్థ నుంచి రాబోయే ఒటీటీ ఎలా ఆదరణ పెంచుతాడు అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube