టైటిల్ : ఓం నమో వేంకటేశాయజానర్ : చారిత్రక భక్తిరస చిత్రంతారాగణం : నాగార్జున, అనుష్క, ప్రగ్యా జైశ్వాల్, సౌరభ్ జైన్, రావూ రమేష్సంగీతం : ఎం.ఎం.కీరవాణిదర్శకత్వం : కే.రాఘవేంద్రరావునిర్మాత : ఎ.మహేష్ రెడ్డి
కింగ్ నాగార్జున – దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ అనగానే మనకు అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస చిత్రాలు గుర్తుకు వస్తాయి.ఆ సినిమాల్లో భక్తిని కళ్లకు కట్టినట్టు చూపిన ఘనత వీరిద్దరికే దక్కింది.ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మరో భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ.ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథలోకి వెళితే :
రాజస్థాన్ బంజారా ప్రాంతంలో జన్మించిన రామం (నాగార్జున) చిన్నతనం నుంచి దేవుణ్ని చూడాలనే కోరికతోనే పెరుగుతాడు.ఆ క్రమంలోనే తిరుమలకు చేరుకుని అక్కడ పద్మానంద స్వామి ( సాయికుమార్)దగ్గర శిష్యరికం చేస్తాడు.తర్వాత కఠోర తపస్సుతో వేంకటేశ్వరుడిని మెప్పిస్తాడు.బాలుడి రూపంలో వచ్చిన వేంకటేశుడు రామం తపస్సుకు భంగం కలిగిస్తాడు.బాలుడి రూపంలో వచ్చింది ఆ భగవంతుడే అన్న విషయం గ్రహించలేని రామం ఆగ్రహంతో వెళ్లిపొమ్మంటాడు
ఇంటికి వెళ్లిన రామానికి పెద్దలు మరదలు భవాని (ప్రగ్యాజైస్వాల్) తో పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు.
భగవంతుడిని దర్శించడమే తన జీవిత ధ్యేయమనుకున్న రామ్ గురువు ద్వారా తన తపోభంగం చేసిన బాలుడే ఆ బాలాజీ అన్న విషయం తెలుసుకుని తిరుమల కొండపైకి చేరుకుంటాడు.అక్కడ ఆశ్రమంలో ఉండే మరో వెంకటేశ్వర సామి భక్తురాలు కృష్ణమ్మ (అనుష్క)తో కలిసి తిరుమల క్షేత్రంలో జరిగే అన్యాయాలను అడ్డుకుని.
ఆ ప్రాంతాన్ని వైకుంఠంగా మార్చేస్తాడు.
రామ్ ఎదుగుదలను తట్టుకోలేని కొందరు అతడిని అక్కడి నుంచి వెళ్లగొట్టాలని ప్రయత్నాలు చేస్తుంటారు.ఆ దుర్మార్గులు ఎవరు ? రామ్ ఆ బాలాజీ వీరభక్తుడు అయిన హతిరామ్ బావాజిగా ఎలా మారాడు ? చివరకు అతడి అమితభక్తి అతడిని ఎక్కడకు చేర్చింది ? అన్నదే ఈ సినిమా స్టోరీ.
విశ్లేషణ :
కథా పరంగా చూస్తే ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ పెద్దగా ఆకట్టుకోవు.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దొరికిన కొంత సమాచారంతో సినిమాను తీసిన విధానం, కథను నడిపించిన తీరు చూస్తే అభినందించక తప్పదు.భక్తిరస చిత్రాలు తెరకెక్కించాలంటే తన తర్వాతే అనేలా సినిమాను ఆసాంతం అద్భుతంగా తెరకెక్కించారు.
చాలా పాటలు వినడానికి, పిక్చరైజేషన్ పరంగాను బాగున్నాయి.ఆలయం దగ్గర రాంపై దాడి చేసే సమయంలో వచ్చే ఏనుగు ఫైట్ థ్రిల్ ఇస్తుంది
సెకండాఫ్‌లో స్వామి పాచికలాడటం, అభరణాలు పోగోట్టుకోవడం, తన భక్తుడిని ఏనుగు రూపంలో కాపాడటం వంటి సన్నివేశాలు మెప్పిస్తాయి.
రాంను దుష్టశక్తి పొడిచినప్పుడు పద్మావతి అమ్మవారు రాంను కాపాడి అగ్నిగుండం ప్రశస్తిని చెప్పే సన్నివేశం బాగుంది.చివర్లో ఏడు కొండలు వాడు, భక్తుడికి మధ్య జరిగే ఎమోషనల్ సీన్స్ హృద్యయంగా ఉంది.మొత్తం మీద సినిమా చూస్తున్నంత తన్మయత్వంగా అనిపించడం ఖాయం.
నటీనటుల పెర్ఫార్మెన్స్ :
అన్నమయ్య, రామదాసుగా భక్తి పాత్రలు చేయడం తనకు కొట్టిన పిండి అని నిరూపించిన నాగ్ హాథీరాం బాబాజీ పాత్రలో మరోసారి తన విశ్వరూపం చూపించాడు.తన నటనలో అమాయకత్వం, ఆవేశం, కరుణ, భక్తి ఇలా అన్ని రసాలను అద్భుతంగా పలికించి హాథీరాం పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.బుల్లితెర దేవుడిగా మైమరిపిస్తోన్న సౌరభ్ జైన్ వేంకటేశ్వరుడిగా అలా ఒదిగిపోయాడు.
కృష్ణమ్మ పాత్రలో అనుష్క నటన బాగుంది.కొండకు చేరిన భక్తుడికి సరైన మార్గం చూపించే పాత్రలో హుందాగా కనిపించింది.
ప్రగ్యా జైశ్వాల్ రొమాంటిక్ సాంగ్‌లో బాగుంది.విలన్ గా రావూ రమేష్ తనకు అలవాటైన నటనతో మెప్పించాడు.ఇతర పాత్రల్లో సంపత్ రాజ్, రఘుబాబు, సాయికుమార్ తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.
టెక్నికల్ టీం :
ఎస్.గోపాల్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందంగా ఉంది.తిరుమల విజువల్స్ అదిరిపోయాయి.
కీరవాణి సంగీతం, పాటలు బాగున్నాయి.గౌతంరెడ్డి ఎడిటింగ్ బాగుంది.
అక్కడక్కడ సినిమా స్లో అయినా ఎడిటింగ్ తప్పులేదు.మహేష్‌రెడ్డి నిర్మాణ విలువలకు వంకే లేదు.
కెకె.భారవి కథకు కాస్త కల్పితం జోడించినా చరిత్ర ఔచిత్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.
రాఘవేంద్రరావు మరోసారి తనకు భక్తిరస చిత్రాలు తెరకెక్కించడంలో అందెవేసిన చేయి అని నిరూపించుకున్నాడు.చరిత్రలో హాథీరాంకు సంబంధించిన విషయాలు పెద్దగా లేకపోయినా.ఉన్న కొద్ది పాటి సమాచారంతో గొప్ప చిత్రాన్ని రూపొందించారు.
ప్లస్ పాయింట్స్ :
* హతిరాం బాబాగా నాగార్జున నటన
* ప్రగ్య జైశ్వాల్ రొమాంటిక్ సాంగ్
* దర్శకత్వం
* మ్యూజిక్ – సినిమాటోగ్రఫీ
* తిరుమల వాతావరణం
మైనస్ పాయింట్స్ :
* బలంగా లేని అనుష్క ఎపిసోడ్
* స్లో నెరేషన్
* కమర్షియల్ టచ్ తక్కువగా ఉండడం
ఫైనల్ పంచ్:
నాగ్ – రాఘవేంద్రుడి కాంబోలో మరో మంచి భక్తిరస చిత్రం