బిగ్ బాస్ మీద నాగార్జునకి ఆసక్తి తగ్గిందా..!

బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ట్ అయ్యే డేట్ దగ్గర పడుతున్నా దానికి సంబందించి ఎలాంటి బజ్ ఏర్పడలేదు.స్టార్ మా కూడా ఇంకా సీజన్ 6లో పాల్గొనే కంటెస్టంట్స్ విషయంలో ఫైనల్ నిర్ణయానికి రాలేదట.

 Nagarjuna Not Interest To Do Host For Biggboss  , Big Boss , Bigboss Season6, Bi-TeluguStop.com

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఇచ్చిన షాక్ లో ఉన్న నిర్వాహకులు సీజన్ 6 మీద ఆడియెన్స్ కి ఆసక్తి కలిగేలా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకే ఈసారి స్టార్ సెలబ్రిటీస్ ని హౌజ్ లోకి తీసుకొచ్చే ఏర్పాట్లు గట్టిగా చేస్తున్నారట.

గత మూడు సీజన్లుగా డిస్కషన్స్ లో ఉన్న క్రేజీ హీరోలను బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.

అందుకు వారు అడిగిన రెమ్యునరేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.

అయితే బిగ్ బాస్ సీజన్ 6కి హోస్ట్ గా కింగ్ నాగార్జుననే చేస్తున్నారు.మొదటి రెండవ సీజన్ తప్ప బిగ్ బాస్ 3వ సీజన్ నుంచి బిగ్ బాస్ నాన్ స్టాప్ కి కూడా నాగార్జున హోస్ట్ గా చేశారు.

అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్ పెద్దగా వర్క్ అవుట్ అవకపోవడంతో హోస్ట్ గా నాగార్జున కి కూడా బిగ్ బాస్ మీద ఆసక్తి తగ్గిందని టాక్.అందుకే సీజన్ 6 కి ఆయన హోస్ట్ గా చేయకూడదని అనుకున్నారట.

అయితే బిగ్ బాస్ టీం వేరే హోస్ట్ వెతికినా దొరకలేదని తెలుస్తుంది.

అందుకే సీజన్ 6కి నాగ్ అయిష్టంగానే హోస్ట్ గా చేసేందుకు ఓకే అన్నారని అంటున్నారు.

బిగ్ బాస్ సీజన్ 6 నాగ్ హోస్ట్ గా ఈసారి మరింత ఎనర్జీగా ఉండాలని చూస్తున్నారు.ఇప్పటికే కంటెస్టంట్స్ లిస్ట్ ఒకటి మీడియాలో నడుస్తుంది.అయితే ఆ లిస్ట్ లో ఎవరు కన్ఫర్మ్ అన్నది మాత్రం ఇప్పుడు చెప్పడం కష్టం.బిగ్ బాస్ సీజన్ 6 మాత్రం సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.

ఈసారి ఆడియెన్స్ ని ఎక్సయిట్ ఫీలయ్యేలా చేసే టాస్క్ లు కూడా ఉంటాయని అంటున్నారు.బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ లో స్టార్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube