కొడుకు భారం మోయలేనంటున్న నాగార్జున... అసలు సిసలు బిజినెస్‌మన్‌ మన నాగ్‌  

అక్కినేని ఫ్యాన్స్‌ చాలా ఆశలు పెట్టుకున్న అఖిల్‌ నటించిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఏమాత్రం ఆకట్టుకోకుండా తాజాగా విడుదలైన మిస్టర్‌ మజ్ను చిత్రం కూడా ఫ్లాప్‌ అయ్యింది. దాంతో అఖిల్‌ నాల్గవ సినిమా విషయంలో ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అఖిల్‌ నాల్గవ సినిమాకు సత్య దర్శకత్వం వహించడం దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. నాల్గవ సినిమా నిర్మాణంను మొదట నాగార్జున అనుకున్నాడు. కాని అఖిల్‌ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేస్తే మూడు సినిమాలు కూడా నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టలేదు. అందులో ఒక సినిమా నాగార్జున కూడా నిర్మించాడు.

మూడు సినిమాల్లో మొదటి సినిమాను నితిన్‌ నిర్మించగా, రెండవ సినిమాను నాగార్జున నిర్మించాడు, మూడవ సినిమాను బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించాడు. మూడు సినిమాల నిర్మాతలకు నష్టాలు మిగిలిన నేపథ్యంలో నాల్గవ సినిమాను నిర్మించేందుకు నిర్మాతలు జంకుతున్నారు. నాగార్జున ఈ చిత్రంను నిర్మించేందుకు ఆసక్తిగా లేడని తెలుస్తోంది. మరో నిర్మాత చేతిలో సినిమాను పెడితే అఖిల్‌ పారితోషికం అయినా వస్తుందనే ఉద్దేశ్యంతో నాగార్జున ఉన్నట్లుగా తెలుస్తోంది.

Nagarjuna Not Interest Produce Akhil 4th Movie-Director Satya

Nagarjuna Not Interest Produce Akhil 4th Movie

నాగార్జున పక్కా బిజినెస్‌మన్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి విషయంలో కూడా లాభం, లెక్కలు వేసుకునే నాగార్జున తాజాగా ఈ విషయంలో కూడా తన కొడుకు అని ఆలోచించకుండా ఆర్థిక విషయాలను పరిగణలోకి తీసుకుని అఖిల్‌ నాల్గవ సినిమా నిర్మాణ బాధ్యతల నుండి తప్పుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలోనే వెళ్లడయ్యే అవకాశం ఉంది. మలుపు చిత్రంతో దర్శకుడిగా మంచి మార్కులు పొందిన సత్య పినిశెట్టి ఈ చిత్రంతో అఖిల్‌కు సక్సెస్‌ ఇస్తాడేమో చూడాలి.