ఎట్టకేలకు బంగార్రాజుకు ముహూర్తం కుదిరింది  

Nagarjuna Next Movie Latest Update-nagarjuna,nagarjuna And Devadas,nagarjuna In Bangarraju

అక్కినేని హీరో నాగార్జున మన్మధుడు చిత్రం తర్వాత చేయబోతున్న సినిమా ఏంటీ అంటే ఇన్నాళ్లు ఠక్కున సమాధానం రాలేదు.ఇకపై ఎలాంటి అనుమానం లేకుండా మన్మధుడు తర్వాత నాగార్జున ప్రస్తుతం చేస్తున్న సినిమా ఏదీ అంటూ ఠక్కున బంగార్రాజు అని చెప్పేయ వచ్చు.

Nagarjuna Next Movie Latest Update-Nagarjuna Nagarjuna And Devadas In Bangarraju

సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి అనుబంధంగా రాబోతున్న బంగార్రాజు చిత్రం కోసం గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు వారి ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పడింది.

బంగార్రాజుకు కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించబోతున్నాడు.మార్చి 3వ తారీకు నుండి ఈ చిత్రాన్ని రెగ్యులర్‌ షూటింగ్‌కు తీసుకు వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం అనూప్‌ రూబెన్స్‌తో సంగీత చర్చలు జరుగుతున్నాయి.దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ మరియు నాగార్జున సంగీత చర్చల్లో పాల్గొంటున్నారు.

అతి త్వరలోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేయబోతున్నారు.రమ్యకృష్ణను ఇప్పటికే ఒక పాత్ర కోసం సంప్రదించారు.నాగచైతన్య కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఆయనకు జోడీ ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

తాజా వార్తలు