తెలుగు బిగ్ బాస్ సందడి పునః ప్రారంభం కాబోతుంది.స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 6 ని ప్రారంభించేందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
కొత్త సీజన్ కు సంబంధించిన మొదటి ప్రోమో కూడా వచ్చేసింది.మొదటి ప్రోమో ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటు షో ప్రారంభం విషయమై అతి త్వరలో అంటూ ప్రకటన రావడంతో అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సీజన్ ఎప్పుడు ప్రారంభం అయ్యేది క్లారిటీ కావాలంటూ ప్రేక్షకులు కోరుతున్నారు.మొన్నటి వరకు ఆగస్టు లో ఈ షో ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ కొత్త సీజన్ ను సెప్టెంబర్ మొదటి ఆది వారం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.రెండవ ప్రోమో మరో వారం పది రోజుల్లో తీసుకు రాబోతున్నారు.
అప్పుడు సీజన్ ప్రారంభం ఎప్పుడు అనేది అధికారికంగా క్లారిటీ ఇవ్వబోతున్నారు.అప్పటి వరకు సెప్టెంబర్ మొదటి వారం అంటూ స్టార్ మా చెప్పే ప్రయత్నాలు చేస్తుంది.
ఈసారి కంటెస్టెంట్స్ విషయం లో లీక్ రావడం లేదు.కొందరి పేర్లు ప్రధానంగా వినిపించినప్పటికి వారు నో అన్నట్లుగా సమాధానం ఇచ్చారు.దాంతో ఇంతకు ఎవరు ఈ సీజన్ లో ఉంటారు అనేది క్లారిటీ కావాలంటూ చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్టార్ మా లోని అత్యంత కీలకమైన వారికి కూడా ఆ విషయాలను తెలియకుండా దాచారట.
దాంతో కంటెంస్టెంట్స్ ఎవరు అనే విషయం సీజన్ ప్రారంభ ఎపిసోడ్ వరకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 లో ఉదయ భాను కనిపించబోతుంది అనే పుకార్లు మాత్రమే వచ్చాయి.
ఆమె తప్ప మరెవ్వరి పేర్లు కూడా ప్రముఖంగా వినిపించలేదు.ఆమె ఉందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు.