నాగ్ ఏమైంది? ది ఘోస్ట్‌ మూవీ రిలీజ్ రేపేనా? అసలు చప్పుడే లేదే?

అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈయన చివరిసారిగా నటించిన బంగార్రాజు సినిమాతో ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు.

 Nagarjuna Neglecting The Ghost Movie Promotions Details, The Ghost Movie, Nagarj-TeluguStop.com

ఈ సినిమా మంచి హిట్ కావడంతో అదే జోష్ లో డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు ది ఘోస్ట్ సినిమా ద్వారా రాబోతున్నారు.నాగార్జున సోనాల్ చౌహాన్ జంటగా నటించిన ఈ సినిమా విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా విడుదలకు కేవలం ఒక్కరోజు మాత్రమే ఉన్నప్పటికీ ఈ సినిమా హంగామా ఎక్కడ కనిపించలేదు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కర్నూలులో ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

ఇకపోతే ఇదే రోజున మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా విడుదల కానుంది.ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత మెగాస్టార్ నటించిన సినిమా కావడంతో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇలా గాడ్ ఫాదర్ చిత్ర బృందం ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ ప్రెస్ మీట్లను నిర్వహిస్తూ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ క్రమంలోనే అదే రోజే విడుదల కాబోతున్న నాగార్జున ది ఘోస్ట్ సినిమాకి సంబంధించి ఎలాంటి చడి చప్పుడు లేకుండా పోవడంతో అక్కినేని అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసలు ఏమైంది నాగార్జున ది ఘోస్ట్ సినిమా గురించి ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించకపోవడం లేదు అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అసలే అదే రోజు మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.

Telugu Chiranjeevi, God, Nagarjuna, Nagarjuna Ghost, Praveen Sattaru, Sonal Chau

ఇలా భారీ పోటీ ఉన్న నేపథ్యంలో సినిమాకి భారీ హైప్ తీసుకువస్తూ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించకుండా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు.డైరెక్టర్ ప్రవీణ్ సైతం ఎక్కడ మీడియా సమావేశాలలో ప్రెస్ మీట్ కార్యక్రమాలలోనూ పాల్గొనలేదు.అలాగే నాగార్జున సైతం ఒక వైపు బిగ్ బాస్ కార్యక్రమంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను గాలికి వదిలేసారు.అసలు నాగార్జున, చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఎందుకు నిర్వహించడం లేదు అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Telugu Chiranjeevi, God, Nagarjuna, Nagarjuna Ghost, Praveen Sattaru, Sonal Chau

మరి కొంతమంది అభిమానులైతే ఈ సినిమా పై స్పందిస్తూ అసలు ది ఘోస్ట్ సినిమా విడుదల తేదీ రేపేనా లేక మరింత సమయం ఉందని చిత్ర బృందం భావిస్తున్నారా అందుకే ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించలేదా అంటూ సినిమా విడుదల తేదీని గుర్తు చేస్తున్నారు.ఏది ఏమైనా నాగార్జున ఈ సినిమా గురించి పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో అభిమానులలో కూడా ఒకింత నిరుత్సాహం ఏర్పడింది.మరి ఈ సినిమా ద్వారా నాగార్జున ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో మరి కొన్ని గంటలలో తెలియనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube