బంగార్రాజు సినిమాకు నాగార్జున, నాగచైతన్యల రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు మూవీ తొలిరోజే దాదాపుగా 10 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.39 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన బంగార్రాజు మూవీ తొలిరోజే 25 శాతం కలెక్షన్లు సాధించడంతో ఈ సినిమా త్వరగానే బ్రేక్ ఈవెన్ అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు నాగార్జున, నాగచైతన్య తీసుకున్న రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

 Nagarjuna Nagachaitanya Remuneration For Bangarraju Movie, Nagarjuna , Nagachai-TeluguStop.com

నాగార్జున ఈ సినిమా కొరకు 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోగా నాగచైతన్యకు 9 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ దక్కినట్టు సమాచారం.

జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి బంగార్రాజు మూవీని నిర్మించగా జీ స్టూడియోస్ 49 కోట్ల రూపాయల బడ్జెట్ లో సినిమా నిర్మించాలని షరతు విధించిందని ఈ సినిమాకు 35 కోట్ల రూపాయలు ఖర్చైందని సమాచారం.మిగిలిన 14 కోట్ల రూపాయిలు నాగార్జున, నాగచైతన్య రెమ్యునరేషన్లుగా తీసుకున్నారు.

పలు ఏరియాల్లో నాగార్జున బంగార్రాజు సినిమాను సొంతంగా విడుదల చేసుకున్నారు.తెలంగాణ టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం బంగార్రాజు సినిమాకు కలిసొస్తుంది.నాగార్జున, నాగచైతన్య రెమ్యునరేషన్ ను డబ్బుల రూపంలో కాకుండా హక్కుల రూపంలో తీసుకున్నారని సమాచారం.సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో నాగార్జున, నాగచైతన్యలకు మరింత ఎక్కువ మొత్తం లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది.

సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలలో బంగార్రాజు సినిమాకే మంచి టాక్ వచ్చింది.మిగతా సినిమాలు ఎక్కువ థియేటర్లలో రిలీజైనా ఏ సినిమాకు యావరేజ్ టాక్ కూడా రాలేదు.విడుదలకు ముందు రౌడీ బాయ్స్, హీరో సినిమాలపై అంచనాలు ఏర్పడినా ఈ సినిమాలకు కలెక్షన్లు మాత్రం నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చే స్థాయిలో ఉన్నాయని బోగట్టా.సంక్రాంతికి విన్నర్ ఎవరనే ప్రశ్నకు సమాధానంగా బంగార్రాజు సినిమా పేరు వినిపిస్తోంది.

Nagarjuna and Naga Chaitanya Remuneration for Bangarraju Movie

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube