బంగార్రాజు మూవీ రివ్యూ: సంక్రాంతి అల్లుళ్ల సరదా మాములుగా లేదుగా!

Nagarjuna Naga Chaitanya Krithi Shetty Ramyakrisnhabangaraju Movie Review And Rating

డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందిన సినిమాబంగార్రాజు’.ఈ సినిమాలో కింగ్ నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టి ప్రధాన పాత్రలో నటించారు.

 Nagarjuna Naga Chaitanya Krithi Shetty Ramyakrisnhabangaraju Movie Review And Rating-TeluguStop.com

అంతేకాకుండా రావు రమేష్, వెన్నెల కిషోర్, చలపతిరావు, బ్రహ్మాజీ తదితరులు నటించారు.ఇక ఈ సినిమాను అన్నపూర్ణ సినీ స్టూడియోస్ నిర్మాణ సంస్థపై అక్కినేని నాగార్జున నిర్మించాడు.

ఇక ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు.ఇక ఈ సినిమా 2016 లో విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాకు సీక్వెల్ గా రూపొందింది.

 Nagarjuna Naga Chaitanya Krithi Shetty Ramyakrisnhabangaraju Movie Review And Rating-బంగార్రాజు మూవీ రివ్యూ: సంక్రాంతి అల్లుళ్ల సరదా మాములుగా లేదుగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ సినిమా నాగార్జునకు ఎటువంటి సక్సెస్ ను అందించిందో చూద్దాం.

కథ:

సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎక్కడైతే పూర్తవుతుందో అక్కడి నుంచే బంగార్రాజు సినిమా కథ ప్రారంభమవుతుంది.ఇక ఇందులో బంగార్రాజు (నాగార్జున) చనిపోయిన సంగతి తెలిసిందే.

ఆయనతో పాటు సత్య (రమ్యకృష్ణ) కూడా చనిపోయి ఉంటుంది.ఇక వీరు తమ మనుమడు చిన్న బంగార్రాజు (నాగచైతన్య) ను చూడాలని ఆశపడతారు.

దీంతో చిన్న బంగార్రాజు తన చదువును పూర్తి చేసుకొని ఊరికి వస్తాడు.అదే సమయంలో నాగలక్ష్మి (కృతి శెట్టి) అనే ఓ అమ్మాయి ఆ ఊర్లో సర్పంచ్ అవ్వాలని అనుకుంటుంది.

ఇక సత్య బంగార్రాజును తమ మనుమడి ప్రేమ కు సహాయం చేయాలని భూమి మీదికి పంపిస్తుంది.అలా చిన్న బంగార్రాజు శరీరంలో దూరిన బంగార్రాజుకి కొన్ని సమస్యలు తలెత్తుతాయి.

దీంతో బంగార్రాజు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడుతాడు అనేది, చిన్న బంగార్రాజు తల్లిదండ్రులు ఏమయ్యారని, ఇంతకు అతని ప్రేమ సక్సెస్ అవుతుందా లేదా అనేది మిగిలిన కథ.

Telugu Bangarraju, Bangraju, Kalyan Krishna, Krithi Shetty, Review, Naga Chaitanya, Nagarjuna, Ramyakrisnha, Tollywood-Movie

నటినటుల నటన:

నాగార్జున తన పాత్రతో అద్భుతంగా మెప్పించాడు.ఇక రమ్యకృష్ణ మాత్రం ఆ పాత్రలో లీనమయ్యింది.నాగచైతన్య కూడా తన పాత్రకు ప్రాణం పోశాడు.

కృతి శెట్టి కూడా అద్భుతంగా నటించింది.ఇక మిగతా నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్:

టెక్నికల్ పరంగా చూసినట్లయితే కళ్యాణ్ కృష్ణ సంక్రాంతికి మంచి కుటుంబ కథను తెరకెక్కించాడు.సినిమాకు తగ్గట్టు నటీనటులను ఎంచుకున్నాడు.

అనూప్ రూబెన్స్ సంగీతం బాగా ఆకట్టుకుంది.సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.

బ్యాక్ గ్రౌండ్ కూడా అద్భుతంగా చూపించారు.

Telugu Bangarraju, Bangraju, Kalyan Krishna, Krithi Shetty, Review, Naga Chaitanya, Nagarjuna, Ramyakrisnha, Tollywood-Movie

విశ్లేషణ:

ఇక ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ గా రావడంతో బాగా ఆకట్టుకుంది.పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో రుచి చూపించాడు డైరెక్టర్.పైగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తీసుకువచ్చి అందులో అన్నీ అభిరుచులను చూపించాడు.

ప్లస్ పాయింట్స్:

నటీనటుల నటన, కామెడీ, రొమాంటిక్ సీన్స్, సినిమా కథ, పాటలు, కథలోని మలుపు, ఎమోషనల్

Telugu Bangarraju, Bangraju, Kalyan Krishna, Krithi Shetty, Review, Naga Chaitanya, Nagarjuna, Ramyakrisnha, Tollywood-Movie

మైనస్ పాయింట్స్:

బలమైన సన్నివేశాలు లేనట్టుగా అనిపిస్తుంది.కాస్త కంటెంట్ మిస్ అయినట్లు అనిపిస్తుంది.

బాటమ్ లైన్:

ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన కి సీక్వెల్ గా వచ్చింది కాబట్టి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాగా తెరకెక్కింది.ఇక ఇందులో నటీనటుల నటన బాగుండటమే కాకుండా.

సంక్రాంతి సందడిగా ఈ సినిమా చూడ్డానికి బాగుంటుంది.కాబట్టి ఈ సినిమాని థియేటర్ లో చూడవచ్చు.

రేటింగ్: 3/5

.

#Review #Krithi Shetty #Naga Chaitanya #Bangarraju #Bangarraju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube