చైతూను ఇబ్బంది పెడుతున్న నాగ్

అక్కినేని నాగార్జున వారసుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తనకంటూ మంచి గుర్తింపును సాధించుకున్నాడు.హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న చైతూ ఇటీవల మంచి ఫాంలోకి వచ్చి వరుస సక్సెస్‌లు అందుకున్నాడు.

 Nagarjuna Forcing Naga Chaitanya  Nagarjuna, Naga Chaitanya, Bangarraju, Lovesto-TeluguStop.com

గతేడాది మజిలీ, వెంకీ మామ చిత్రాలతో బ్యాక్‌ టు బ్యాక్ సక్సెస్ అందుకున్న ఈ హీరోను ప్రస్తుతం తన తండ్రి ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది.

చైతూ ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో లవ్‌స్టోరీ మూవీలో నటిస్తున్నాడు.

అయితే ఈ సినిమా పూర్తి కాకముందే చైతూను నాగార్జున తాను నటించబోయే సినిమాలో నటించాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నాడట.గతంలో ‘సోగ్గాడే చిన్ని నాయన’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న నాగ్, ఇప్పుడు బంగార్రాజు అనే టైటిల్‌తో దానికి సీక్వెల్ తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ సినిమాలో చైతూ నటించాల్సిందిగా నాగ్ కోరుతున్నాడు.

అయితే ఈ సినిమాలో నటించడం చైతూకు ఇష్టం లేదని తెలుస్తోంది.

అటు సొంత ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేయాలని చూస్తున్న చైతూకి నాగ్ నో అని చెబుతున్నట్లు తెలుస్తోంది.మరి నాగ్ చేస్తున్న ఈ ఒత్తిడిని చైతూ ఎలా తట్టుకుంటాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube