మన్మధుడి బిజినెస్‌ మామూలుగా లేదు  

Nagarjuna Manmadhudu 2 Movie Pre Business-keerthi Suresh,mahanati,manmadhudu 2,manmadhudu 2 Pre Business,rakul Preeth Singh

నాగార్జున చాలా కాలం తర్వాత చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. ఈమద్య కాలంలో నాగార్జున నుండి సినిమా వస్తుంది అంటే పెద్దగా పట్టించుకోని జనాలు ఈసారి మన్మధుడు 2 విషయంలో మాత్రం చాలా ఆసక్తిగా ఉన్నారు. నాగార్జున గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రం బిజినెస్‌ విషయంలో చాలా తేడా కనిపిస్తుంది. నాగార్జున గత చిత్రాలు 30 కోట్ల లోపు ఉండేది. కాని ఈసారి మాత్రం ఏకంగా 50 కోట్లను క్రాస్‌ చేసింది. అన్ని ఏరియాల్లో కూడా మంచి బిజినెస్‌ను చేయడంతో పాటు శాటిలైట్‌ రైట్స్‌ విషయంలో కూడా భారీ మొత్తంలో అమ్ముడు పోయింది..

మన్మధుడి బిజినెస్‌ మామూలుగా లేదు-Nagarjuna Manmadhudu 2 Movie Pre Business

చాలా ఏళ్ల క్రితం వచ్చిన మన్మధుడు చిత్రం మంచి విజయాన్ని అందుకుని నాగార్జున కెరీర్‌లో అది బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను దక్కించుకుంది. ఇప్పుడు అదే టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రం మరింత బ్లాక్‌ బస్టర్‌ అవ్వడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతుంది. అందుకే సినిమా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందని ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుందని ఈ చిత్ర దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ చెబుతున్నాడు.

చిలసౌ వంటి విభిన్నమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాహుల్‌ ఈ చిత్రంతో మరో విజయాన్ని సొంతం చేసుకుంటాడేమో చూడాలి. ఈ చిత్రం ట్రైలర్‌ను మరో రెండు రోజుల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో గెస్ట్‌ రోల్స్‌లో కీర్తి సురేష్‌ మరియు సమంతలు కూడా కనిపించబోతున్నారు. ముగ్గురు ముద్దుగుమ్మలతో పాటు విదేశీ మోడల్స్‌ కూడా చాలా మంది ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.

అందుకే ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అంటూ మాస్‌ ఆడియన్స్‌ నమ్మకం పెట్టుకున్నారు. ఆ కారణంగానే బిజినెస్‌ దాదాపుగా 60 కోట్ల వరకు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.