ఇప్పుడు ఎక్కడ చూసినా ఊపిరి సినిమా గురించే డిస్కషన్ సాగుతోంది.ఈ సినిమా ఎంత వసూలు చేసింది అనేదానికంటే ఎంతమందికి నచ్చింది అనే విషయం మీద తీవ్ర చర్చ జరుగుతోంది.
మొదట అటూ ఇటూ గా మల్టీ ప్లేక్స్ వారికి మత్రమే ఎక్కుతుంది అనుకున్నారు కానీ కార్తీ క్యారెక్టర్ కారణంగా అనుకుంట అందరికీ ఈ సినిమా తెగ నచ్చేస్తోంది.ఫస్ట్ హాఫ్ కడుపుబ్బా నవ్వుకున్న జనాలు సెకండ్ హాఫ్ లో ఏడిచే పరిస్థితి .ఈ విషయం లో నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య తన రెస్పాన్స్ ని తెలియజేసాడు.”ఊపిరి సినిమా ఎంతో అద్భుతంగా ఉంది.అందమైన ఎమోషనే ఆ సినిమాకు ఆత్మ.ఈ మధ్య కాలంలో ఇలాంటి ఎమోషన్ ను మనం మర్చిపోతున్నాం.సినిమా చూస్తుంటే ఏడుపొచ్చేసింది” అంటూ సెలవిచ్చాడు నాగచైతన్య.ఇప్పటికే చాలామంది హృదయాలను దోచుకున్న ఊపిరి సినిమా.
నాగార్జున పెద్ద కొడుకును కూడా క్లీన్ బౌల్డ్ చేసేసిందట.ఈరోజు సినిమా చూసిన అనంతరం ఆ విషయాన్ని తెలిపాడు చైతూ.