ఆఫీసర్‌ వల్ల నాగ్‌ రెండు రకాలుగా నష్టపోయాడు

అక్కినేని నాగార్జున హీరోగా వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆఫీసర్‌’ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటం జరిగింది.

 Nagarjuna Loss With Officer Movie-TeluguStop.com

దాంతో చిత్ర యూనిట్‌ సభ్యులు అవాక్కయ్యారు.ఎన్నో అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం మరీ ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదు అంటూ సినీ వర్గాల వారు కూడా అంటున్నారు.

ఈ చిత్రంతో వర్మకు నష్టం వచ్చి ఉంటుందని, వర్మ ఇలాంటి సినిమాలు తీసినందుకు ఆయనకు జరగాల్సిందే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వర్మ ఆఫీసర్‌ చిత్రానికి నిర్మాత అయినా కూడా నష్టాలు మాత్రం రాలేదని, ఆయన అనుకున్నదానికంటే కాస్త ఎక్కువగానే లాభాలు వచ్చాయి అంటున్నారు.రామ్‌ గోపాల్‌ వర్మ నమ్మించి, గట్టిగా హామీ ఇచ్చి మరీ ఈ సినిమాకు నాగార్జునను ఒప్పించాడు.సహజంగా అయితే సినిమాకు నాగార్జున కనీసం 5 నుండి 6 కోట్ల మేరకు పారితోషికంగా తీసుకుంటాడు.కాని ఈ చిత్రం కోసం నాగార్జునకు వర్మ కేవలం 2.5 కోట్లు మాత్రమే ఇచ్చాడు అని, మిగిలిన మూడు కోట్లను సినిమా విడుదలైన తర్వాత ఇస్తాను అంటూ హామీ ఇచ్చాడట.కాని సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆకట్టుకోలేక పోవడంతో, కలెక్షన్స్‌ రావడం లేదు.

వర్మ సినిమాను ఒప్పుకోవడంతో భారీ డిజాస్టర్‌ ఖాతాలో పడటంతో ఒక విధంగా నష్టపోయిన నాగార్జున, పారితోషికం విషయంలో రెండో రకంగా నష్టపోయాడు.

వర్మను నమ్మి తన కెరీర్‌లో భారీ డిజాస్టర్‌ను ఖాతాలో వేసుకోవడంతో ఆయన క్రేజ్‌ తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు.వర్మ ఏం చేసినా కూడా ఈమద్య పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాడు.

అయినా కూడా నాగార్జున ఆయన్ను నమ్మడం అనేది ఆయన చేసిన పెద్ద తప్పు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

రామ్‌ గోపాల్‌ వర్మను తాజాగా పారితోషికం అడిగిన నాగార్జునకు ఊహించని సమాధానం భించిందట.

కలెక్షన్స్‌ బాగానే వస్తున్నాయి.వారం రోజుల్లో ఖచ్చితంగా మీ బ్యాలన్స్‌ ఇస్తాను అంటూ హామీ ఇచ్చాడట.

ఈ మాటలతోనే వర్మ తనకు పారితోషికం ఇవ్వలేడని తేలిపోయిందని నాగార్జున భావిస్తున్నాడు.నాగార్జున గత కొంత కాలంగా సినిమాల ఎంపిక విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా అనిపించడం లేదు.

ఇష్టం వచ్చినట్లుగా, దర్శకుపై నమ్మకంతో సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు.ఇలా చేయడం వల్ల ఆయన కెరీర్‌లో ఇంకా చాలా రకాలుగా నష్టపోతాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube