యంగ్ హీరో కి తండ్రిగా నాగార్జున... అభిమానులు ఒప్పుకుంటారా..?

మారుతున్న జనరేషన్ కొద్దీ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొత్త కొత్త ప్రయోగాలకి కొంతమంది హీరోలు నాంది పలుకుతున్నారు.అంతేకాక కొంత మంది హీరోలు కూడా కథ నచ్చితే ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

 Nagarjuna Is Playing Father Role In Naga Shourya Movie-TeluguStop.com

దీంతో మల్టీ స్టారర్ చిత్రాలకి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది.కాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఈ మధ్య కాలం లో మల్టీస్టారర్ చిత్రాల పై బాగానే ఆసక్తి కనబరుస్తున్నాడు.

దీంతో అన్ని కుదిరితే తొందర్లోనే నాగార్జున టాలీవుడ్ కి చెందిన ఓ యంగ్ హీరోతో కలిసి నటించే అవకాశాలు ఉన్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

 Nagarjuna Is Playing Father Role In Naga Shourya Movie-యంగ్ హీరో కి తండ్రిగా నాగార్జున… అభిమానులు ఒప్పుకుంటారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇంతకీ విషయం ఏంటంటే తెలుగులో చలో, ఊహలు గుసగుసలాడే, తదితర చిత్రాలతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న యంగ్ హీరో నాగ శౌర్య ఇటీవలే ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

 అయితే ఈ చిత్రంలో నాగ శౌర్య తండ్రి పాత్రలో బాలయ్య బాబు నటిస్తున్నట్లు గతంలో పలు వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం బాలయ్య బాబు ఇతర చిత్ర షూటింగులతో బిజీ బిజీగా గడుపుతుండడంతో ఈ చిత్రంలో నటించలేనని చెప్పాడట.

దీంతో ఈ అవకాశం కింగ్ నాగార్జున వరించినట్లు సమాచారం.

అంతేగాక ఈ చిత్ర దర్శకుడు ఇప్పటికే నాగార్జున ను సంప్రదించి కథను కూడా వినిపించాడని, కానీ ప్రస్తుతం నాగార్జున కూడా రెండు చిత్ర షూటింగ్ లలో బిజీగా ఉండడంతో తనకు కొంత సమయం కావాలని అడిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అన్నీ కుదిరితే ఈ చిత్రం జూన్ నెలలో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయట.కానీ ఈ చిత్రంలో హీరో నాగ శౌర్య తండ్రి పాత్రలో నాగార్జున నటిస్తున్నట్లు వినిపిస్తున్న వార్తలపై ఇప్పటివరకు నాగార్జున మాత్రం స్పందించలేదు.

దీంతో ఈ విషయంలో నిజమెంతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నాగ శౌర్య తెలుగులో “వరుడు కావలెను” చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

 ఈ చిత్రానికి నూతన దర్శకురాలు “లక్ష్మీ సౌజన్య” దర్శకత్వం వహిస్తోంది. అలాగే నాగార్జున కూడా తెలుగులో “వైల్డ్ డాగ్”  అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

 ఈ చిత్రంలో నాగార్జున పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.అలాగే బాలీవుడ్లో “బ్రహ్మాస్త్ర” అనే చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.

#Naga Shourya #Nagarjuna #NagarjunaIs #NagaShourya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు