పేస్ యాప్ కూడా నాగార్జున వయస్సు తగ్గించలేకపోయింది  

Nagarjuna Is A Challenge To The Faceapp Challenge-akkineni Heros,manchu Lakshmi,nagarjuna,tollywood

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన పేస్ యాప్ చాలెంజ్ హడావిడి కనిపిస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ పేస్ యాప్ చాలెంజ్ లో పాల్గొని తన వృద్ధాప్యంలో తన పేస్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని టెస్ట్ చేసుకొని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ యాప్ ప్రభావంతో అందరూ తాము వృద్ధాప్యంలో ఇలా ఉంటాం అంటూ షేర్ చేసుకుంటున్నారు..

పేస్ యాప్ కూడా నాగార్జున వయస్సు తగ్గించలేకపోయింది-Nagarjuna Is A Challenge To The FaceApp Challenge

ఇక సెలబ్రిటీలు కూడా ఈ చాలెంజ్ లో ఉత్సాహంగా పాల్గొని తమ రూపాన్ని చూపిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా అన్న‌పూర్ణ సంస్థ `మ‌న్మ‌థుడు, మ‌న్మ‌థుడు-2` సినిమాల్లోని స్టిల్స్‌ను ప‌క్క‌ప‌క్క‌న పెట్టి ఓ ఫోటోను ట్వీట్ చేసింది. 2002లో విడుద‌లైన మ‌న్మ‌థుడు సినిమాలోని స్టిల్‌ను, 2019లోని మ‌న్మ‌థుడు-2 లోని స్టిల్‌ను ప‌క్క‌ప‌క్క‌న పెట్టి నాగ్ అందాన్ని త‌గ్గించ‌డం ఈ యాప్ కి సాధ్యం కాదు అంటూ పోస్ట్ పెట్టింది. ఫేస్‌ యాప్‌ ఛాలెంజ్‌కే కింగ్ నాగార్జున ఒక ఛాలెంజ్‌ లాంటి వార‌ని పేర్కొంది.అయితే పేస్ యాప్‌ ఉపయోగించిన తర్వాత అక్కినేని ఫ్యామిలీ అంటూ మంచు ల‌క్ష్మి కూడా ఓ ఫోటో షేర్ చేశారు.

ఫోటోలోని సుశాంత్‌, అఖిల్‌, నాగచైతన్య వృద్ధులుగా మారిపోతే నాగార్జున మాత్రం అలాగే యంగ్ లుక్ లో ఉన్నారు. నాగార్జున విష‌యంలో ఇది నిజ‌మే. సుశాంత్‌, అఖిల్‌, నాగచైతన్య ఇప్పటి నుంచే నాగ్‌ వద్ద చిట్కాలు నేర్చుకోండి.

మా నాన్న విషయంలో మా పరిస్థితి ఇంతే అని మంచు లక్ష్మి కామెంట్ చేసింది. మొత్తానికి ఈ పేస్ యాప్ చాలెంజ్ సెలబ్రిటీలకి కూడా కాస్తా ఎడిక్ట్ గా మారినట్లు దీనిని బట్టి అనిపిస్తుంది.