నాగార్జున గుడ్డిగా వెళ్లి పోతున్నాడు

కింగ్‌ నాగార్జున ఈమద్య కాలంలో చేస్తున్న సినిమాలు, కమిట్‌ అయిన సినిమాలు, విడుదలైన సినిమాలను చూస్తుంటే ఏదో సినిమాలు చేయాలి కాబట్టి చేస్తున్నాడు అంతే అన్నట్లుగా అనిపిస్తుంది.నిర్మాతలు డబ్బులు ఇస్తున్నారు, నేను నటిస్తున్నాను అన్నట్లుగా నాగార్జున వ్యవహరిస్తున్న తీరు అక్కినేని అభిమానులకు ఆవేదన కలిగిస్తుంది.

 Nagarjuna In Kalyan Krishna Directoragain-TeluguStop.com

కొడుకుల కెరీర్‌పై పెడుతున్న దృష్టి తన సినిమాలపై పెట్టడం లేదనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తం అవుతుంది.అందుకే గత కొంత కాలంగా నాగార్జున వరుసగా ఫ్లాప్‌ అవుతూ వస్తున్నాడు అంటూ ఫ్యాన్స్‌ అంటున్నారు.

ఇటీవలే విడుదలైన ‘ఆఫీసర్‌’తో పాటు త్వరలో కళ్యాణ్‌ కృష్ణతో చేయబోతున్న సినిమాల విషయంలో నాగార్జున నిర్ణయంను అంతా తప్పుబడుతున్నారు.

నానితో ప్రస్తుతం శ్రీరాం ఆధిత్య దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్‌ను నాగార్జున చేస్తున్నాడు.దర్శకుడు శ్రీరాం ఆధిత్య పెద్దగా అనుభవం లేని దర్శకుడు.ఆయన ఈమల్టీస్టార్‌ను ఆకట్టుకునే విధంగా తీస్తాను అనే నమ్మకం ఎవరికి లేదు.

ఎందుకటే ఆయన గత చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేదు కనుక, ఈ చిత్రం కూడా మెప్పించలేదని ఫిక్స్‌ అయ్యారు.ఈ సమయంలోనే నాగార్జున కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను దక్కించుకున్న సోగ్గాడే చిన్ని నాయన చిత్ర దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణతో ‘బంగార్రాజు’ చిత్రాన్ని చేయబోతున్నాడు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.గత రెండు సంవత్సరాలుగా బంగార్రాజు గురించిన కథ చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తాజాగా రవితేజ హీరోగా వచ్చిన ‘నేలటిక్కెట్టు’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.ఈ దెబ్బకు నాగార్జున, కళ్యాణ్‌ కృష్ణల కాంబోలో బంగార్రాజు లేనట్లే అంటూ అంతా భావించారు.

కాని షాకింగ్‌గా త్వరలోనే బంగార్రాజును మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.అక్కినేని వారి హోం బ్యానర్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని సినీ వర్గాల్లో సమాచారం అందుతుంది.నాగార్జున తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సినీ వర్గాల్లో మరియు అభిమానుల్లో కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

బంగార్రాజు చిత్రం చేయాలనే కోరికతో నాగార్జున దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ట్రాక్‌ రికార్డును పట్టించుకోవడం లేదని, ఆయన సోగ్గాడే చిన్ని నాయన సినిమా తప్ప ఏ సినిమా కూడా ఆకట్టుకోలేదని, బంగార్రాజు చిత్రంతో ఆకట్టుకుంటాడని నాగార్జున ఎలా అనుకుంటున్నాడు అంటూ సినీ విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు.నాగార్జున సినిమాల ఎంపిక విషయంలో గుడ్డిగా వ్యవహరిస్తున్నాడు అని, ఆయన తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

నాగార్జున మంచి చిత్రాలను ఎంపిక చేసుకోవాలని సన్నిహితులు కూడా సలహా ఇస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube