బిగ్ బాస్ 5 షూటింగ్ లో నాగార్జున.. త్వరలోనే హోస్ట్ ప్రోమో!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న నాగార్జున రోజురోజుకు యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ గా మారిపోతున్నారు.ఆరు పదుల వయసు వచ్చినప్పటికీ నాగార్జున మాత్రం ఎంతో హుషారుగా ఒకవైపు సినిమాలలోనూ, మరోవైపు బుల్లి తెరపై నటిస్తూ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

 Nagarjuna In Bigg Boss Shooting Host Promo Soon Nagarjuna, Bigg Boss, New Seaso-TeluguStop.com

ఇక బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పటికే నాలుగు సీజన్లలో పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే ఐదవ సీజన్ ప్రారంభం కాబోతుంది.

అయితే బిగ్ బాస్ సీజన్ ఒకటికి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.సీజన్ 2 కి నాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఇక మూడు,నాలుగు సీజన్లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించి ప్రేక్షకులను సందడి చేశారు.ఇక త్వరలోనే ప్రారంభం కాబోయే సీజన్ ఫైవ్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

Telugu Bibb Boss, Bigg Boss, Nagarjuna, Season, Tollywood-Movie

ఇప్పటికే బిగ్ బాస్ రియాలిటీ షో ప్రసారం చేయడానికి నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ విజువల్ ఐడెంటితో పాటు, ఈ ఆటలో వివిధ వేరియంట్స్ ను తెలియజేసేలా బిగ్ బాస్ లోగోను నిర్వాహకులు తయారు చేశారు.ఈ క్రమంలోనే ఈ లోగో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఇటువంటి నాగార్జున బిగ్ బాస్ 5 ప్రోమోలో భాగంగా షూటింగ్ లో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే అప్పుడు తీసిన ఫోటోలు బయటకు రావడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.బ్లాక్ డ్రెస్ లో గాగుల్స్‌తో స్టైల్‌గా వస్తున్నటువంటి ఫోటో, అదేవిధంగా చేతిలో పెద్ద గన్ పట్టుకుని ఉన్న ఫొటో బయటకు రావడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ క్రమంలోనే నాగార్జున బిగ్ బాస్ ప్రోమో లో పాల్గొన్నారని త్వరలోనే ఈ ప్రోమో విడుదల కాబోతోందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube