కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో 2016లో వచ్చిన సినిమా సోగ్గాడే చిన్ని నాయనా.సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో నాగార్జున కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది మళ్లీ ఆరేళ్ల తర్వాత సోగ్గాడు సినిమాకు ప్రీక్వల్ ప్లాన్ చేశారు.
బంగార్రాజు టైటిల్ తో వస్తున్న ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు డబుల్ ఎంటర్టైన్ అందిస్తుందని అంటున్నారు.సంక్రాంతి కానుకగా ఈ నెల 14న బంగార్రాజు రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోగ్గాడు సినిమా సీక్వల్స్ వస్తూనే ఉంటాయని బంగార్రాజుతో అది ముగుస్తుందని అనుకోవట్లేదని హింట్ ఇచ్చారు నాగార్జున.అంటే సోగ్గాడే 3వ పార్ట్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పకనే చెప్పారు నాగార్జున.
అయితే పార్ట్ 3 ఉంటుందా లేదా అన్నది బంగార్రాజు రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది.సోగ్గాడే చిన్ని నాయనా తర్వాత కళ్యాణ్ కృష్ణతో చాలా ఏళ్లుగా బంగార్రాజు సినిమా కోసం వర్క్ చేయించారు.
మరి ఈ సినిమా సీక్వల్ ఉంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.నాగార్జునకి జోడీగా రమ్యకృష్ణ నటించిన ఈ సినిమాలో నాగ చైతన్య, కృతి శెట్టి యువ జంటగా కనిపించనున్నారు.