'పొన్నియన్ సెల్వన్'ను తెగ పొగిడేసిన నాగ్.. ఈ సినిమా కోసమేనా?

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.ఒకపక్క తన కొడుకులు కూడా హీరోలుగా సినిమాలు చేస్తున్న నాగ్ మాత్రం ఇప్పటికి తగ్గకుండా సోలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు.

 Nagarjuna Heaps Praises On Ponniyin Selvan, Ponniyin Selvan, The Ghost, Nagarjun-TeluguStop.com

ఈ మధ్యనే బ్రహ్మాస్త్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా అభిమానులను పలకరించాడు.ఈ సినిమా విజయం సాధించడంలో నాగ్ ముఖ్య పాత్ర పోషించాడు.

ఇక ఇప్పుడు నాగ్ సోలో హీరోగా అదృష్టం పరీక్షించు కోవడానికి ప్రేక్షకుల నాగార్జున నటిస్తున్న సినిమాల్లో యాక్షన్ థ్రిల్లర్ ”ది గోస్ట్” సినిమా ఒకటి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా నుండి వచ్చిన అన్ని ప్రొమోషనల్ కంటెంట్ మంచి అంచనాలు క్రియేట్ చెయ్యగా.ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్ వరుస ప్రొమోషన్స్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో నాగ్ రా ఏజెంట్ గా కనిపించ నున్నాడు..సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో గుల్ పనాగ్, అనికా సురేంద్రన్ నటించారు.నాగ్ గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమాను యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు.ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత బజ్ పెరిగింది.ఇక ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు.

దీంతో నాగ్ తెలుగులోనే కాదు మిగతా ఇండస్ట్రీలో కేసుల ఈ సినిమాపై బజ్ పెంచడానికి వరుస ప్రొమోషన్స్ లో పాల్గొంటున్నాడు.

ఈ క్రమంలోనే నాగ్ ఘోస్ట్ ప్రొమోషన్స్ లో భాగంగా చెన్నై ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు.అక్కడి మీడియా నాగ్ ను పొన్నియన్ సెల్వన్ గురించి అడిగారు.ఈ నేపథ్యంలోనే నాగ్ ఈ సినిమాపై తెగ ప్రశంసలు కురిపించారు.

ఈ సినిమా బాగుందని తాను పుస్తకాన్ని కూడా చదివానని తెలిపారు.బాహుబలితో పోల్చి ట్రోల్ చేసేవారిని నమ్మవద్దు అంటూ తెలిపాడు.

మరి ఇదంతా ఘోస్ట్ సినిమా కోసమే అని తెలుస్తుంది.చూడాలి యాక్షన్ సినిమాతో రాబోతున్న ఈ సినిమా నాగ్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube