నాగార్జున ఘోస్ట్‌, బంగార్రాజు ల్లో మొదట రాబోతున్నది ఏది?

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున మన్మధుడు 2 తర్వాత కాస్త స్లో అయ్యాడు.ఆ సినిమా పై చాలా నమ్మకం పెట్టుకుని నటిస్తే వచ్చిన ఫలితం చూసి సినిమా ల ఎంపిక విషయంలో ఇక ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో చాలా గ్యాప్ తీసుకుని వైల్డ్ డాగ్ సినిమాను చేశాడు.

 Nagarjuna Ghost And Bangarraju Movies Ready To Release,latest Tollywood News-TeluguStop.com

ఆ సినిమా పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకుంది.కాని కమర్షియల్‌ గా మాత్రం హిట్‌ కొట్టలేక పోయింది.

ఇప్పుడు ఘోస్ట్‌ మరియు బంగార్రాజు సినిమా లను ఈయన చేస్తున్న విషయం తెల్సిందే.ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఘోస్ట్‌ సినిమా రూపొందోంది.

వైల్డ్‌ డాగ్ తరహాలోనే నాగార్జున ఎన్‌ ఐ ఏ ఏజెంట్‌ గా నాగార్జున కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక నాగార్జున బంగార్రాజు సినిమా కూడా జెట్‌ స్పీడ్‌ తో షూటింగ్ జరుపుకుంటోంది.

Telugu Bangarraju, Ghost, Nagarjuna, Nagarjunabigg-Movie

బంగార్రాజు సినిమా కు సంబంధించిన ఫస్ట్‌ లుక్ విడుదల అవ్వడంతో పాటు సినిమాకు సంబంధించిన హీరోయిన్‌ లుక్ ను కూడా రివీల్‌ చేయడం జరిగింది.భారీ అంచనాలున్న బంగార్రాజు సినిమా స్పీడ్‌ చూస్తుంటే మొదట ప్రారంభం అయ్యిన ఘోస్ట్‌ కంటే ముందే వచ్చలా ఉందని టాక్ వినిపిస్తుంది.ఒక వేళ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా సంక్రాంతికే బంగార్రాజు సినిమా కనుక వస్తే ఖచ్చితంగా ఘోస్ట్‌ కు అది కలిసి వస్తుంది.

ఎందుకంటే బంగార్రాజు సినిమా కాస్త హెవీ అంచనాలను కలిగి ఉంది.కరోనా తర్వాత భారీ అంచనాలతో రావడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది.కనుక ఈ సమయంలో ఘోస్ట్‌ సినిమా కంటే బంగార్రాజును ముందు తీసుకు రావడం వల్ల ఫలితం పాజిటివ్‌ గా ఉంటుందని అంటున్నారు.నెల నుండి 45 రోజుల వ్యవధిలోనే ఈ రెండు సినిమాలను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube