అందరికి షాక్‌ ఇచ్చిన నాగార్జున  

నాగార్జున సూపర్‌ హిట్‌ చిత్రం ‘మన్మధుడు’. అప్పట్లో నాగార్జునకు భారీ విజయాన్ని అందించిన ఆ చిత్రం మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో జరుగుతుంది. తాజాగా నాగార్జున ఫిల్మ్‌ ఛాంబర్‌లో మన్మధుడు 2 అనే టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించడం జరిగింది. దాంతో ఆ టైటిల్‌తో మన్మధుడుకు సీక్వెల్‌ రాబోతుంది అంటూ ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషించుకుంటున్నారు. అయితే ఆ టైటిల్‌ అఖిల్‌ కోసం అంటూ ఒక వర్గం వారు చెబుతున్నారు.

Nagarjuna Gets Devadasu 2 Title Booked For Akkineni Akhil-

Nagarjuna Gets Devadasu 2 Title Booked For Akkineni Akhil

ప్రస్తుతం అఖిల్‌ మూడవ సినిమా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. నిన్న మొన్నటి వరకు ‘మిస్టర్‌ మజ్ను’ అంటూ ఆ చిత్రానికి టైటిల్‌ అనుకున్నారు. అయితే మన్మధుడు అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఆ టైటిల్‌ను ప్రయత్నించారు. కాని అదే టైటిల్‌ పెట్టే వీలు లేకపోవడంతో మన్మధుడు 2 అంటూ రిజిస్ట్రర్‌ చేయించినట్లుగా సమాచారం అందుతుంది. అఖిల్‌కు మన్మధుడు టైటిల్‌ బాగా సూట్‌ అవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు మాత్రం త్వరలో అఖిల్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతుంది. ఆ చిత్రం కోసం నాగార్జున ముందే మన్మధుడు 2 అనే టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అఖిల్‌ మూడవ సినిమా లేదంటే ఆ తర్వాత సినిమా అయినా మన్మధుడు 2 అవుతుందని మాత్రం ఎక్కువ శాతం మంది అనుకుంటున్నారు. మరో వైపు నాగచైతన్యకు కూడా మన్మధుడు 2 అయ్యే అవకాశం ఉందని, ఆయన్ను కూడా పరిశీలించవచ్చు అంటున్నారు.

Nagarjuna Gets Devadasu 2 Title Booked For Akkineni Akhil-

మొత్తానికి మన్మధుడు 2 టైటిల్‌ ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ టైటిల్‌ విషయంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ నుండి లేదంటే అక్కినేని వారి నుండి కాని ఏదైనా క్లారిటీ వస్తే కాని ఫ్యాన్స్‌ టెన్షన్‌ తగ్గదు.