నాగార్జున ముందే అఖిల్ రొమాన్స్.. నీ ఇల్లు అనుకున్నావా అంటూ?

బుల్లితెర పై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం వారం రోజులు ఇంట్లో గొడవలు పోట్లాటలతో ఉన్నప్పటికీ సండే మాత్రం ఎంతో ఫన్ డే గా మారిపోతుంది.శని ఆదివారాలలో నాగార్జున స్టేజ్ పైకి వచ్చి సభ్యులతో ముచ్చటించి వారిని సందడి చేస్తుంటారు.

 Nagarjuna Fires On Akkineni Akhil Roamnce With Pooja Hegde In Bigg Boss 5 Telugu-TeluguStop.com

ప్రతి వారం మాదిరిగానే ఈ వారం సండే ఎంతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున హౌస్ సభ్యులతో ముచ్చటించారు.అదేవిధంగా శనివారం కొండపొలం టీమ్ బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయగా ఆదివారం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీమ్ బిగ్ బాస్ వేదికపై సందడి చేసింది.

ఇలా అఖిల్ పూజా హెగ్డే స్టేజిపైకి ఎంటర్ అవుతూనే లెహరాయి అనే పాటతో ఎంట్రీ ఇస్తూ ఎవరిని పట్టించుకోకుండా ఇద్దరూ రొమాన్స్ లో మునిగిపోవడంతో స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున అఖిల్ నూ ఉద్దేశిస్తూ ఇదేమైనా నీ ఇల్లు అనుకున్నావా.? అంటూ అఖిల్ పై కన్నెర్ర చేయగా అఖిల్ కూడా తనదైన శైలిలో నాగార్జున పై కౌంటర్ వేసాడు.ఎవరో చెప్పారు ఈ స్టేజ్ నాదేనని అంటూ అఖిల్ అనగా ఈ స్టేజ్ నాది అంటూ నాగార్జున వారితో ముచ్చటించారు.ఇక హౌస్ సభ్యులతో బ్యాచిలర్ టీమ్ మాట్లాడుతూ ఎంతో సందడి చేశారు.

ఈ క్రమంలోనే నాగార్జున హౌస్ సభ్యులకు పూజా హెగ్డేను ఇంప్రెస్స్ చేసే టాస్క్ ఇచ్చారు.

Telugu Akhil, Akhilpooja, Hamida, Kondapolam, Nagarjun, Pooja Hegde, Sri Ram-Mov

ఇందులో భాగంగా శ్రీరామ్ పూజ హెగ్డే నటించిన అలా వైకుంఠపురం సినిమా నుంచి సామజ వరగమన అనే పాట పాడుతూ తనని ఇంప్రెస్ చేశారు.పాట పాడిన తర్వాత ఇది నీకు అడ్వాంటేజ్ గా ఉందని నాగార్జున శ్రీరామ్ పై కౌంటర్ వేయగా అందుకు సన్నీ స్పందిస్తూ తన ని ఇంప్రెస్ చేయాలని మైండ్ వాడుతున్నాడు అంటూ చెప్పగా లేని దానిని ఎలా వాడుతారు అంటూ తిరిగి నాగార్జున వారి పై కౌంటర్ వేసాడు.ఇలా ఆదివారం ఈ కార్యక్రమం ఎంతో సరదాగా సాగిపోయిన చివరికి ఎలిమినేషన్ వేటు తప్పలేదు.

హౌస్ నుంచి ఐదవ వారం ఐదవ కంటెస్టెంట్ గా హమీద ఎలిమినేట్ అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube