శ్రీముఖి, పునర్నవిలను ఏకి పారేసిన నాగ్‌, అసలేం జరిగిందంటే  

Nagarjuna Fire On Srimukhi And Punarnavi - Telugu Nagarjuna, Nagarjuna Fire In Mahesh Get Out Of Big Boss, Shilpa Chakravarthi, Telugu Big Boss 3

గత రెండు సీజన్‌లతో పోల్చితే ఈ సీజన్‌లో బిగ్‌ బాస్‌ ఇంటి సభ్యుల ఆట తీరు పరమ చెత్తగా ఉందని, అలాగే బిగ్‌బాస్‌ ఇస్తున్న టాస్క్‌లు కూడా పరమ చెత్తగా ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి.ఈ విషయమై చాలా రోజులుగా సోషల్‌ మీడియాలో టాక్‌ వస్తూనే ఉంది.

Nagarjuna Fire On Srimukhi And Punarnavi

ఈ కారణంగానే బిగ్‌బాస్‌ సీజన్‌ 3 రేటింగ్‌ మరీ దారుణంగా పడిపోయింది.బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులు ఇందుకు కారణం అని నిర్వాహకులు భావిస్తున్నారు.

అందుకే నిన్న వీకెండ్‌ ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులందరికి కూడా నాగార్జున సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చాడు.

శ్రీముఖి, పునర్నవిలను ఏకి పారేసిన నాగ్‌, అసలేం జరిగిందంటే-Movie-Telugu Tollywood Photo Image

 ముఖ్యంగా శ్రీముఖి మరియు పునర్నవిలకు నాగార్జున ఇచ్చిన క్లాస్‌తో అంతా షాక్‌ అయ్యారు.ఇక మహేష్‌ను ఏకంగా గేట్‌ ఓపెన్‌ చేసి మరీ బయటకు వెళ్లిపో అంటూ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశాడు.షూ పాలీష్‌ చేయడం అంత తప్పు పనేం కాదని, ఏ పని చేసినా అందులో గౌరవం ఉంటుంది.

అది చేసే విధానం సరిగా ఉంటే ప్రతి ఒక్కరు గౌరవిస్తారు అంటూ నాగార్జున తన షూను పాలీష్‌ చేసుకుని మరీ చూపించాడు.ఇక శ్రీముఖి ఇంట్లో దెయ్యం నాకేం భయం టాస్క్‌ ఆగిపోవడంకు కారణం అయ్యిందని నాగార్జున అన్నాడు.

 నలుగురిని ఆడకుండా చేసి టాస్క్‌ కంప్లీట్‌ అంటూ శ్రీముఖి తనే బాస్‌లా ప్రవర్తించింది.టాస్క్‌ మరో లెవల్‌ ఉంటుంది.నీ వల్ల టాస్క్‌ మద్యలోనే ఆగిపోయింది అంటూ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇక పునర్నవిని కూడా ఓ రేంజ్‌లో అనేశాడు.బిగ్‌బాస్‌ను నోటితో చెప్పకూడని పదాలను తిట్టావు.అలా ఎలా మాట్లాడుతావు, చదువుకున్న దానివి నువ్వు కనీసం పరిజ్ఞానం లేదా అంటూ తీవ్రంగా మండి పడ్డాడు.

మొత్తానికి నిన్నంతా కూడా ఇంటి సభ్యులను ఒక ఆట ఆడేసుకున్నాడు నాగార్జున.ఇక ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయిన వారిలో హిమజ సేవ్‌ అవ్వగా పునర్నవి, శ్రీముఖి, మహేష్‌ ఇంకా శిల్పా చక్రవర్తి ఉన్నారు.

నిన్ననే జరిగిన షూట్‌లో శిల్ప ఎలిమినేట్‌ అయ్యిందని లీక్‌ వచ్చింది.అది ఎంత వరకు నిజమో నేడు తెలియనుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు