‘దేవదాస్‌’ ఫలితంపై నాగార్జున అనుమానం, అందుకే..!  

Nagarjuna Doubt About Devadasu Movie Result-

నాగార్జున, నాని కలిసి నటించిన మల్టీస్టారర్‌ మూవీ ‘దేవదాస్‌’ విడుదలకు సిద్దం అవుతుంది.వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవదాస్‌ చిత్రంపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు..

Nagarjuna Doubt About Devadasu Movie Result--Nagarjuna Doubt About Devadasu Movie Result-

భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మల్టీస్టారర్‌ చిత్రంపై సోషల్‌ మీడియాలో ఒక వర్గం వారు పుకార్లు క్రియేట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా సోషల్‌ మీడియాలో.దేవదాస్‌ చిత్రంపై నాగార్జునకు నమ్మకం లేదని, అందుకే ఎడిటింగ్‌ రూంలో స్వయంగా కూర్చుని కొన్ని సీన్స్‌ను ఎడిట్‌ చేయించాడట.

ఫైనల్‌ వర్షన్‌ చూసిన తర్వాత కూడా నాగార్జున సంతృప్తిని వ్యక్తం చేయలేదని, అందుకే ఎక్కువ ప్రమోషన్స్‌ చేయడం ద్వారా మంచి ఓపెనింగ్స్‌ అయినా రాబట్ట వచ్చు అంటూ నిర్మాత అశ్వినీదత్‌కు సలహా ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది.సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియదు, కాని ప్రేక్షకులు మాత్రం ఆ పుకార్లతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

నాగార్జున గత చిత్రం ‘ఆఫీసర్‌’ భారీ డిజాస్టర్‌గా నిలిచింది.ఆ కారణంగానే ఈ చిత్రంపై అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.

నాగార్జున లుక్‌ చాలా బాగుందని, డాన్‌గా నాగార్జున అరిస్తాడు అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా పుకార్లు వారికి ఆందోళన కలిగిస్తున్నాయి.అయితే సోషల్‌ మీడియా పుకార్లు పట్టించుకోనక్కర్లేదని, తప్పకుండా ఈ చిత్రం విజయాన్ని దక్కించుకుంటుందనే అభిప్రాయంను కొందరు అక్కినేని అభిమానులు ధీమాగా ఉన్నారు..

నానికి కూడా ఇది చాలా కీలకం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.నాగార్జునతో కలిసి నటించి మొదటి మల్టీస్టారర్‌ చిత్రం ఇదే అవ్వడంతో నాని అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.రష్మిక మందనా ఒక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగ్‌ డాన్‌గా నాని డాక్టర్‌గా కనిపించబోతున్నారు.

సినిమా మొదటి నుండి చివరి వరకు ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందని నిర్మాత అశ్వినీదత్‌ అంటున్నారు.మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి అంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.