రెండేళ్ళ తరువాత శ్రీవారి సన్నిధిలో నాగార్జున దంపతులు!

మన రెండు తెలుగు రాష్ట్రాలలో తిరుపతి శ్రీవారి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది కావడంతో ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు.ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు సైతం నిత్యం స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు.

 Nagarjuna Couple Went Tripati After Two Years Later, Nagarjuna, Amala, Tollywood, Tripati, Film Industry-TeluguStop.com

ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జున ఆయన సతీమణి అమల నేడు స్వామివారి దర్శనం చేసుకున్నారు.ఈ క్రమంలోనే నాగార్జున దంపతులకు ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు స్వాగతం పలికారు.

ఈ క్రమంలోనే నాగార్జున దంపతులు శుక్రవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు.ఇలా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆలయ అధికారులు నాగార్జున దంపతులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

 Nagarjuna Couple Went Tripati After Two Years Later, Nagarjuna, Amala, Tollywood, Tripati, Film Industry-రెండేళ్ళ తరువాత శ్రీవారి సన్నిధిలో నాగార్జున దంపతులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు నాగార్జున దంపతులకు పట్టువస్త్రాలను సమర్పించి వేదపండితుల ఆశీర్వాదం అందించారు.

Telugu Amala, Nagarjuna, Tollywood, Tripati-Movie

స్వామివారి దర్శనం అనంతరం నాగార్జున ఆలయ ప్రాంగణంలో మీడియాతో ముచ్చటించారు.ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత స్వామివారి దర్శనాన్ని చేసుకున్నామని తెలిపారు.గత రెండు సంవత్సరాల నుంచి కోవిడ్ ఉన్న కారణంగా స్వామివారి దర్శనాన్ని చేసుకోలేకపోయానని ఇలా రెండు సంవత్సరాల తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్లు నాగార్జున తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube