నాగ్‌ బాలీవుడ్‌ మూవీ సెల్ఫ్‌ డబ్బా మరీ ఎక్కువ అయ్యింది  

నాగార్జున సుదీర్ఘ కాలం తర్వాత బాలీవుడ్‌ లో బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న ఈ సినిమాలో షాహిద్‌ కపూర్‌ మరియు ఆలియా భట్‌ నటిస్తున్నారు.

TeluguStop.com - Nagarjuna Brahmastra Movie Budget In News

అమితాబచ్చన్‌ మరియు నాగార్జునలు కీలక పాత్రలో ఈ సినిమాను చేస్తున్నారు.ఈ సినిమాను కరణ్‌ జోహార్‌ ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థతో కలిసి 300 కోట్ల రూపాయల బడ్జెట్‌ తో రూపొందిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

కాని ఇప్పుడు అంతకు మించి బడ్జెట్‌ అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి.తాజాగా ఆ సినిమా నిర్మాతల్లో ఒక్కరు మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మస్త్ర సినిమా అనేది ఇండియాలోనే అత్యధిక బడ్జెట్‌ తో రూపొందుతున్న సినిమా అంటూ ప్రకటించాడు.

TeluguStop.com - నాగ్‌ బాలీవుడ్‌ మూవీ సెల్ఫ్‌ డబ్బా మరీ ఎక్కువ అయ్యింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్న కారణంగా త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం అంటున్నారు.

ఈ సినిమా బడ్జెట్‌ అనుకున్న దాని కంటే 50 శాతం అదనం అయ్యిందంటున్నారు.అంటే ఈ సినిమా కోసం ఏకంగా 450 కోట్లు పెట్టినట్లుగా చెబుతున్నారు.రికార్డు స్థాయిలో ఈ సినిమాకు మాత్రమే అత్యధికంగా ఇండియాలో ఖచ్చు పెట్టామని అంటున్నారు.

అయితే అంతకు ముందు సాహో మరియు బాహుబలితో పాటు 2.ఓ సినిమాలకు కూడా భారీగా ఖర్చు చేశారు.

అయినా కూడా బ్రహ్మాస్త్ర మేకర్స్‌ మాత్రం ఈ సినిమా కోసం అత్యధికంగా పెట్టామంటూ ఉన్నారు.ఈ సినిమా షూటింగ్‌ కోసం అందరు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

కాని షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదు.ఈ సమయంలో బడ్జెట్‌ విషయం చెప్పి అందరి దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయంలో అంతా కూడా చర్చ జరుగుతోంది.బ్రహ్మాస్త్రకు అంత సీన్‌ ఉందా అంత పెట్టి ఉంటారా అంటూ చర్చించుకుంటున్నారు.

హిందీతో పాటు మరో నాలుగు అయిదు భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారు.

#Brahmastra #Big B Movie #NagarjunaHindhi #Alia Bhutt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nagarjuna Brahmastra Movie Budget In News Related Telugu News,Photos/Pics,Images..