నాగార్జున అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌

కింగ్‌ నాగార్జున బాలీవుడ్‌ లో 17 ఏళ్ల క్రితం ఒక సినిమాలో నటించాడు.మళ్లీ ఇప్పటి వరకు ఆయన బాలీవుడ్‌ లో చేసింది లేదు.

 Nagarjuna Bollywood Movie Brahmastra Shelved   Nagarjuna, Brahmastra, Wild Dog,-TeluguStop.com

ఇన్నేళ్ల తర్వాత బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్నాడు.భారీ బడ్జెట్‌ తో బాలీవుడ్‌ స్టార్స్‌ నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్‌ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ఈ బాలీవుడ్‌ సినిమా అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది.ఎట్టకేలకు ఫుల్‌ స్వింగ్‌ లో షూటింగ్‌ జరుపుకుంటూ ఉండగా కరోనా వచ్చింది.

దాంతో పది నెలలు వాయిదా పడింది.మళ్లీ ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెప్పలేని పరిస్థితి.

ఎందుకంటే ఈ సినిమా షూటింగ్‌ మొదలు పెట్టడానికి ముందు బడ్జెట్‌ కోతలో భాగంగా సినిమాను మూడు గంటల నిడివి నుండి రెండున్నర గంటలకు తగ్గించాలంటూ దర్శకుడికి నిర్మాణ సంస్థ సూచించింది.

రెండున్నర గంటల్లో సినిమాను ముగించడం వల్ల బడ్జెట్‌ భారం తగ్గుతుంది.

ఇప్పటికే ఈ సినిమాకు చాలా బడ్జెట్‌ అయ్యింది.ఇంకా ఎక్కువ బడ్జెట్‌ అంటే వర్కౌట్‌ అవ్వడం సాధ్యం అయ్యే పని కాదు.

అందుకే ఈ సినిమాను తగ్గించడం వల్ల కాస్త అయినా ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.కాని మరో నిర్మాత అయిన కరణ్‌ జోహార్‌ మరియు దర్శకుడు మాత్రం సినిమా నిడివి తగ్గిస్తే ఖచ్చితంగా ఫలితంపై ప్రభావం ఉంటుంది.

కథను రెండున్నర గంటల్లో చూపించడం అనేది సాధ్యం అయ్యే విషయం కాదు.అందుకే మూడు గంటల పాటు సినిమాను తీయాల్సిందే అంటూ వారు భావిస్తున్నారట.

ఈ నేపథ్యంలో సినిమా తాత్కాలికంగా ఆగిపోయింది.ప్రస్తుతం నాగార్జున వైల్డ్‌ డాగ్‌ సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు.

ముందుగా అనుకున్న ప్రకారం జనవరిలో బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్‌ లో నాగ్‌ పాల్గొనాల్సి ఉండగా అది క్యాన్సిల్‌ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube