నాగార్జున బాలీవుడ్‌ మూవీ విడుదల తేదీపై క్లారిటీ

Nagarjuna Bollywood Movie Brahmastra Release Date

టాలీవుడ్ కింగ్ నాగార్జున సుదీర్ఘ కాలం తర్వాత బాలీవుడ్లో ఒక సినిమాను చేస్తున్నాడు.అదే బ్రహ్మాస్త్ర.

 Nagarjuna Bollywood Movie Brahmastra Release Date-TeluguStop.com

బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్తో రూపొందుతోంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తో పాటు ఇంకా పలువురు ప్రముఖ నటీ నటులు కూడా నటిస్తున్నారు.

ఈ సినిమాలో నాగార్జున నటిస్తున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.గత రెండేళ్ల కాలంగా ఈ సినిమా అదిగో ఇదిగో అంటూ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది.

 Nagarjuna Bollywood Movie Brahmastra Release Date-నాగార్జున బాలీవుడ్‌ మూవీ విడుదల తేదీపై క్లారిటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఇప్పటికీ ఈ సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల అవుతుంది అనుకుంటూ ఉండగా బ్రహ్మాస్త్ర ఏకంగా వచ్చే ఏడాది ద్వితీయార్ధం అది కూడా సెప్టెంబర్ 9వ తారీఖున రాబోతున్నట్లు గా యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్‌ కు పలు అంతరాయాలు ఎదురవుతున్నాయి.షూటింగ్ జరుగుతున్న సమయంలో చిత్ర యూనిట్ సభ్యులకు సంబంధించి ఏదో ఒక విషయం ఇబ్బంది కలిగించడంతో పాటు కరోనా వల్ల గత రెండేళ్లుగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

మద్యలో కొన్ని రోజులు షూటింగ్  సాగింది.మళ్లీ సెకండ్‌ వేవ్‌ వల్ల షూటింగ్‌ ను నిలిపి వేశారు.

ఆరు నెలల తర్వాత మళ్లీ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు ప్రకటించారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది మార్చి లో షూటింగ్ ని పూర్తి చేసి, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను నిర్వహించారు.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కనీసం ఆరు నెలల సమయం పడుతుందని అంటున్నారు.

Telugu Alia Bhatt, Amitab Bachchan, Bangarraju, Bollywood, Brahmastra, Ghost, Naga Chaitanya, Nagarjuna, Ranbeer Kapoor, Tollywood-Movie

అందుకే ఈ సినిమాను 2022 సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున విడుదల చేసేందుకు గాను ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.నాగార్జున ఈ సినిమాతో మంచి హిట్ అందుకొని హిందీలో వరుసగా సినిమాలు చేస్తాడేమో చూడాలి.ఇక తెలుగులో ఆయన సినిమాల విషయానికొస్తే బంగార్రాజు సినిమా చేస్తున్నాడు.

మరోవైపు ఘోస్ట్‌ అనే సినిమాను కూడా  చేస్తున్నాడు.సినిమాలో నాగచైతన్య మరియు నాగార్జున కలిసి నటించడం వల్ల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

వీరిద్దరు సినిమాలో తాతా-మనవడు గా కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.నాగార్జునకు  రమ్యకృష్ణ నాగచైతన్య కు కృతిశెట్టి జోడిగా కనిపించబోతుంది.

#Brahmastra #Bangarraju #Alia Bhatt #Naga Chaitanya #Ranbeer Kapoor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube