అయిదున్నర నెలల తర్వాత అంటూ నాగ్‌ కీలక ప్రకటన

కరోనా కారణంగా గత అయిదు ఆరు నెలలుగా టాలీవుడ్‌ ప్రముఖుల నుండి సినీ కార్మికుల వరకు అంతా కూడా ఇంటికే పరిమితం అయ్యి ఉన్నారు.ఒక్కరు ఇద్దరు షూటింగ్స్‌కు హాజరు అవుతున్నా కూడా పూర్తి స్థాయిలో మాత్రం షూటింగ్స్‌ జరగడం లేదు.

 Nagarjuna Bigg Announcement About Bigg Boss And Movie, Nagarjuna, Tollywood, Big-TeluguStop.com

కరోనా ఇప్పట్లో పోయేలా లేదనే ఉద్దేశ్యంతో మెల్లగా షూటింగ్స్‌ కు రెడీ అవుతున్నారు.తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 కు సంబంధించిన ప్రకటన వచ్చేసిన విషయం తెల్సిందే.

ఇప్పటికే షో కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.నేడు నాగ్‌ పుట్టిన రోజు ఈ సందర్బంగా ఆయన ట్విట్టర్‌ ద్వారా మరో కీలక ప్రకటన చేశాడు.

అయిదున్నర నెలల తర్వాత మళ్లీ పని చేయబోతున్నాను. షూటింగ్స్‌ లేకపోవడంతో ఇన్నాళ్లు ఇంట్లోనే ఉన్న నాగార్జున సోమవారం నుండి షూటింగ్స్‌ కు హాజరు అవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు.

ఈ విషయంలో ఆయన చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. బిగ్‌ బాస్‌ తో పాటు ఈయన వైల్డ్‌ డాగ్‌ సినిమా షూటింగ్‌ లో కూడా పాల్గొనబోతున్నట్లుగా పేర్కొన్నాడు.

వచ్చే నెలలో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి డిసెంబర్‌ లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.మరో వైపు ప్రవీణ్‌ సత్తారు మూవీకి కూడా నాగ్‌ ఓకే చెప్పిన విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube