నెం.1 నాగ్‌ గట్స్‌ కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే

కరోనా భయంతో స్టార్‌ హీరోలు ఎవరు కూడా కనీసం ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు.ముఖ్యంగా సీనియర్‌ స్టార్‌ హీరోలు బయటకు అంటే బాబోయ్‌ అంటున్నారు.

 Hats Off Nagarjuna Guts For Big Boss Shooting,nagarjuna, Big Boss 4, Wild Dog, O-TeluguStop.com

ఇలాంటి సమయంలో నాగార్జున ధైర్యంగా వైల్డ్‌ డాగ్‌ షూటింగ్‌ కు హాజరవ్వడం చర్చనీయాంశంగా ఉంది.సినిమాను పూర్తి చేయాలనే కమిట్‌ మెంట్‌ మరియు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇతరులకు ఆదర్శం అంటూ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

నాగార్జున చేస్తున్న షూటింగ్‌ ఇతర హీరోలకు ఆదర్శం కావాలని సినీ కార్మికులు వేడుకుంటున్నారు.

ఆరు నెలల తర్వాత కెమెరా ముందుకు వచ్చిన నాగార్జున కు సినీ ప్రముఖులు మరియు అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇతర హీరోలు ఎవరు రాని సమయంలో మీరు షూటింగ్‌ కు వచ్చారు.స్టార్‌ హీరోల జాబితాలో షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యింది మీరే కనుక మీరు నెం.1 అంటూ అక్కినేని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైల్డ్‌ డాగ్‌ సినిమాను ఓటీటీ విడుదల చేసే ఉద్దేశ్యంతో షూటింగ్‌ ను ఫినీష్‌ చేసేందుకు నాగ్‌ ఈ సాహస నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

మరో వైపు నాగార్జున బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 కు కూడా రెడీ అవుతున్నాడు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు బిగ్‌ బాస్‌ షో తో నాగార్జున భారీ పారితోషికంను దక్కించుకోబోతున్నాడు.

ముఖ్యంగా ఈ విపత్కర పరిస్థితుల్లో షో కు హోస్టింగ్‌ చేస్తున్నందుకు గాను అదనంగా కూడా పారితోషికంను పొందుతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈనెల 6వ తారీకు నుండి బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube