బిగ్‌బాస్‌ మొదటి ప్రోమో వచ్చేసింది చూశారా?  

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు బిగ్‌బాస్‌ కొత్త సీజన్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మొదటి మూడు సీజన్‌లు సక్సెస్‌ అవ్వడంతో నిర్వాహకులు కూడా నాల్గవ సీజన్‌ను మరింత ప్రతిషాత్మంగా తీసుకు రావాలని భావించారు.

TeluguStop.com - Nagarjuna Big Boss 4 Nageswarao Big Boss Promo Coronavirus

అయితే కరోనా కారణంగా ఆలస్యం అయిన బిగ్‌బాస్‌ను మొదలు పెట్టేందుకు రంగం సిద్దం అయ్యింది.అతి త్వరలో బిగ్‌బాస్‌ షో ప్రారంభం అవ్వబోతుంది.

ఇది అఫిషియల్‌.ఇప్పటికే బిగ్‌బాస్‌ కు సంబంధించిన ప్రకటన వచ్చేసింది.

TeluguStop.com - బిగ్‌బాస్‌ మొదటి ప్రోమో వచ్చేసింది చూశారా-Movie-Telugu Tollywood Photo Image

తాజాగా నాగార్జునతో ప్రోమో వచ్చేసింది.

నాగార్జున మొదటి ప్రోమోలో అచ్చు ఆయన తండ్రి నాగేశ్వరరావును పోలి ఉన్నారు.

వృద్దుడి గెటప్‌లో నాగార్జునను ఈ ప్రోమోలో చూడవచ్చు.మొదటి ప్రోమో అవ్వడంతో ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌గా చూపించారు.

తదుపరి ప్రోమోలో షో ఎప్పుడు ఏంటీ అనే విషయాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. నాగార్జున చాలా ఆసక్తిగా ఈ షో కోసం ఎదురు చూస్తున్నాడు అన్నట్లుగా ఈ ప్రోమోలో చూపించారు.

కంటెస్టెంట్స్‌ జాబిత దాదాపుగా ఫైనల్‌ అయ్యింది.వారందరిని కూడా హోం క్వారెంటైన్‌లో ఉంచేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు.

మొదటి మూడు సీజన్‌లకు వేరు వేరు హోస్ట్‌లు చేశారు.మొదటి సారి ఈ సీజన్‌కు నాగ్‌ కంటిన్యూ అవుతున్నాడు.ప్రస్తుతం షోకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో నాగార్జున కూడా డేరింగ్‌ స్టెప్‌ తీసుకుని ముందుకు అడుగు వేయడం నిజంగా అభినందనీయం అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఆగస్టు చివరి వారంలో లేదంటే వచ్చే నెల మొదటి వారంలో ఈ షో పట్టాలెక్కే అవకాశం ఉంది.

#BiggBoss 3 #Big Boss Promo #TeluguBigg #Contestents #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు