బిగ్‌బాస్‌4 : గంగవ్వ కన్నీళ్లు, జోకర్‌ ఎంట్రీతో కళకళ  

Gangavva Crying In Big Boss House, And Mukku Avinash Entry Wild Card Entry, Nagarjuna, Big Boss 4, Gangavva, Mukhu Avinash, Wild Card Entry - Telugu Big Boss 4, Gangavva, Mukhu Avinash, Nagarjuna, Wild Card Entry

ఈ సీజన్‌ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న గంగవ్వ ఆ వాతావరణం లో ఉండలేక ఇబ్బంది పడుతోంది.ఇంటి సభ్యులు ఆమెను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఉన్నారు.

TeluguStop.com - Nagarjuna Big Boss 4 Gangavva Mukhu Avinash

అయినా కూడా ఆమెకు ఏమాత్రం అక్కడి వాతావరణంలో ఉండటానికి వశపడటం లేదు.ఆమె మొదటి వారం రోజులు బాగానే ఉన్నట్లుగా అనిపించినా రెండవ వారం మొదలు ఆమె ఆరోగ్యం విషయంలో మార్పులు రావడంతో పాటు ఆమె అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నట్లుగా అనిపిస్తుంది.

ఇంటి సభ్యులు ఆమె పట్ల ఎంతో వాత్సల్యంగా ఉంటున్న కారణంగా ఇన్నాళ్లు అయినా ఉండగలిగింది.ఆరోగ్యం బాగా లేక పడుకున్న సమయంలో ఆమెను కన్ఫెషన్‌ రూంకు బిగ్‌బాస్‌ పిలిసి ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తాం భయపడకండి అన్నాడు.

TeluguStop.com - బిగ్‌బాస్‌4 : గంగవ్వ కన్నీళ్లు, జోకర్‌ ఎంట్రీతో కళకళ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మీరు చాలా ధైర్యం కలిగిన వారిగా భావిస్తున్నాం అన్నారు.ఆ సమయంలో గంగవ్వ కన్నీరు పెట్టుకోవడం అందరిని కదిలించింది.ఉండటానికి సరిగా ఇళ్లు లేక పోవడంతో డబ్బులు వస్తాయని వచ్చాను.కాని నా వల్ల అవ్వడం లేదు.

మీరు అమ్మలా చూసుకుంటున్నారు.అందరు కూడా ఎంతో మంచిగా ఉంటున్నారు.

అయినా ఈ వాతావరణంలో ఉండటం నా వల్ల అవ్వడం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.గంగవ్వ ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని రోజులు ఉండటం చాలా గొప్ప విషయమే.

సంపూర్నేష్‌ బాబు కనీసం వారం రోజులు కూడా ఉండలేక పోయాడు.గంగవ్వ రెండు వారాలు అంతకు ముందు క్వారెంటైన్‌ లో రెండు వారాలు గడిపింది.

అంటే ఇప్పటికే ఆమె ఊరు వదిలి వచ్చి నాలుగు వారాలు అయ్యింది.కనుక ఆమె ప్రాణం లాగుతోంది.

నిన్నటి ఎపిసోడ్‌ లో ఆమెను చూస్తే ఎవరికైనా బాధగా అనిపిస్తుంది.

ఇక నిన్నటి ఎపిసోడ్‌ లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ గా ముక్కు అవినాష్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అతడి రాకతో ఇంట్లో సందడి వాతావరణం కనిపిస్తోంది.అతడు వచ్చిన వెంటనే ఇంటి సభ్యులు అతడికి సాదర స్వాగతం పలికారు.

అతడితో కామెడీ చేయించారు, నవ్వుకున్నారు.అమ్మాయి డ్రస్‌ వేసి అతడితో క్యాట్‌ వాక్‌ చేయించారు.

ఇక నిన్నటి ఎపిసోడ్‌ లో మరో కీలక విషయం సుజాత, అభిజిత్‌ల మద్య జరిగింది.సుజాతను తాను సిస్టర్‌గా అనుకుంటాను అంటూ అభిజిత్‌ అనడం జరిగింది.

అందుకు సుజాత బాగా ఫీల్‌ అయ్యింది.సిస్టర్‌ అన్నందుకు సుజాత ఎందుకు ఫీల్‌ అయ్యిందో అందరు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

#Wild Card Entry #Big Boss 4 #Nagarjuna #Gangavva #Mukhu Avinash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nagarjuna Big Boss 4 Gangavva Mukhu Avinash Related Telugu News,Photos/Pics,Images..