మా దివి మాట్లాడిందోచ్‌

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ప్రారంభం అయ్యి నాలుగు రోజులు అయ్యింది.మొదటి రోజు కంటెస్టెంట్స్‌ పరిచయం జరుగగా మూడు రోజుల షో జరిగింది.

 Memes About Bigg Boss Divi In Social Media , Nagarjuna, Big Boss 4, Diwi, Sohel,-TeluguStop.com

ఈ మూడు రోజుల్లో ఒక్కసారి కూడా హాట్‌ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చిన దివి మాత్రం నోరు విప్పలేదు.ఆమె మాట్లాడక పోవడంపై అంతా కూడా అనూహ్యంగా స్పందించారు.

దివి మూడు రోజులుగా అసలు ఏమాత్రం మాట్లాడక పోవడంతో ఆమె షో లో ఉన్నా లేనట్లుగా ఉంది అంటూ కామెంట్స్‌ వినిపించాయి.బిగ్‌బాస్‌ గారు ఏంటండి మూగ అమ్మాయిని షో కు తీసుకున్నారు అంటూ సోషల్‌ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కామెంట్స్‌ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఈ సమయంలో ఆమె నోటి నుండి మాట రావడంతో సోషల్‌ మీడియాలో మీమ్స్‌ రచ్చ రచ్చగా వస్తున్నాయి.

మా దివి మాట్లాడిందోచ్‌ అంటూ చాలా మంది నెటిజన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేయడం మీమ్స్‌ పోస్ట్‌ చేయడం చేస్తున్నారు.

నేడు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌ లో దివి కాస్త ఎక్కువగానే మాట్లాడబోతుంది అంటూ ప్రోమోలో చూస్తుంటే అర్థం అవుతుంది.ప్రోమోలో ఆమె రెండు ముక్కలు మాట్లాడితేనే సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వందల్లో పోస్ట్‌ అవుతున్నాయి.

ఆమె ఈ రోజు షో మొత్తంలో మాట్లాడే మాటలు విన్న తర్వాత అంటే రేపు ఏ స్థాయిలో నెటిజన్స్‌ ఆమెపై మీమ్స్‌ చేస్తారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నిన్నటి ఎపిసోడ్‌ లో సోహెల్‌, అరియానా హౌస్‌ లోకి ఎంట్రీ ఇచ్చి రచ్చ రచ్చ చేస్తూ అందరిని ఒక రౌండ్‌ వేసుకుంటున్న సమయంలో కూడా దివి మౌనంగానే ఉంది.కాని ఇప్పుడు దివి మాట్లాడుతుంది.ఆమె ఈ వారం ఎలిమినేషన్‌ లో ఉన్న కారణంగా కాస్త నిరుత్సాహంలో ఉండి ఉంటుందని కొందరు అనుకుంటూ ఉన్నారు.

ఈ సమయంలో తన వంతు రావడంతో మాటలు బాగానే మాట్లాడేసింది.ఇంటి సభ్యులపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా మాట్లాడి అందరికి షాక్‌ ఇచ్చింది.నేడు ఎపిసోడ్‌ ను చాలా మంది దివి కోసం చూస్తామంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube