టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్లో ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఈ సినిమాకు బంగార్రాజు అనే టైటిల్‌ను కూడా చిత్ర యూనిట్ ఫిక్స్ చేయగా, ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించేందుకు గత కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.కాగా ఈ సినిమా చాలా ఆలస్యం అవుతూ వస్తుండటంతో అసలు ఈ సినిమా పట్టాలెక్కుతుందా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది.
అయితే ఈ సినిమా గురించి నాగ్ తాజాగా ఓ ప్రకటన చేశాడు.ఈ సినిమాకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలిగిపోయాయని, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కడం ఖాయమని ఆయన అన్నాడు.
అంతేగాక అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయడం కూడా ఖాయమని ఆయన అన్నారు.దీంతో ఈసారి బంగార్రాజు ఎట్టిపరిస్థితుల్లో కూడా షూటింగ్ జరుపుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో కూడా నాగ్ సోగ్గాడే చిన్ని నాయన గెటప్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనా బంగార్రాజు చిత్రంపై ఎట్టకేలకు ఓ క్లారిటీ రావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అక్కినేని అభిమానులు ఎంతో ఆశగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో అందాల నటి రమ్యకృష్ణ కూడా నటిస్తుండగా, మిగతా నటీనటుల గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.మరి 2022 సంక్రాంతి బరిలో నిజంగానే బంగార్రాజు బరిలోకి దిగుతాడా, సంక్రాంతి బరిలో బంగార్రాజు ఇతర స్టార్ హీరోల పోటీని ఎంతమేర తట్టుకుంటాడా అనే అంశాలు చూడాల్సి ఉంది.