బజ్.. చైతూ నాగ్ ఇద్దరూ 'బంగార్రాజు'లేనా ?

టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ హిట్ తో ఫుల్ ఖుషీగా ఉన్నాడు.ఈ సినిమా తర్వాత నాగార్జున కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు‘ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

 Nagarjuna Bangarraju Movie Latest Interesting Latest Update, Nagarjuna, Naga Cha-TeluguStop.com

ఈ సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన‘ సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది.

ఈ సినిమా వచ్చిన కొత్తలోనే బంగార్రాజు సినిమా కూడా ప్రకటించాడు.కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు రాలేదు.ఈ సినిమాలో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు.‘మనం‘ సినిమా తర్వాత మళ్ళీ తన తండ్రితో కలిసి నాగ చైతన్య బంగార్రాజు సినిమా చేయబోతున్నాడు.ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు.అయితే తాజాగా వినిపిస్తున్న బజ్ ఏంటంటే ఈ సినిమాలో చైతూ పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో తండ్రి కొడుకులిద్దరూ బంగార్రాజు పాత్రలోనే కనిపించే బోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

Telugu Bangarraju, Bangarrajustory, Kalyan Krishna, Naga Chaitanya, Nagarjuna, S

ఇందులో యంగ్ ఏజ్ లో నాగ చైతన్య, మిడిల్ ఏజ్ లో నాగార్జున బంగార్రాజుగా కనిపిస్తారని ఒక వార్త వినిపిస్తుంది.అదే సమయంలో నాగార్జున నాగ చైతన్య ఇద్దరు తాత మనవడి పాత్రల్లో కనిపించ నున్నారని మరొక వార్త కూడా వినిపిస్తుంది.

Telugu Bangarraju, Bangarrajustory, Kalyan Krishna, Naga Chaitanya, Nagarjuna, S

తాత పేరు బంగార్రాజు అయితే మనవడి పేరు కూడా బంగార్రాజు అనే పెడతారని.తాత తన మనవడి సమస్యను పరిష్కరించడానికి స్వర్గం నుండి వస్తారని.ఈ ఇద్దరు బంగార్రాజులు కలిసి ఈసారి ప్రేక్షకులను అలరిస్తారని వీళ్ళు చేసే హంగామా మాములుగా ఉండదని టాక్ వాట్సఉంది.

ఈసారి మనవడి పాత్ర కూడా కొంటెగా అల్లరిగా ఉంటుందని చెప్పుకుంటున్నారు.మరి చూడాలి ఈ వార్తలో నిజమెంతో తెలియాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube