బంగార్రాజు లో ఐదుగురు బ్యూటీలు!

టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున కుర్ర హీరోలతో సమానంగా ఫిట్ నెస్ మైంటైన్ చేస్తూ ఇప్పటికి కొడుకులకు కూడా పోటీ ఇస్తున్నాడు.ఆరు పదుల వయసులో కూడా వరుసపెట్టి సినిమాలు చేస్తూ దూకుడుగా ఉన్నాడు.

 Nagarjuna Bangarraju Movie Latest Interesting Update-TeluguStop.com

ఈ మధ్యనే వైల్డ్ డాగ్ సినిమాతో హిట్ అందుకుని అదే సంతోషంలో ఇప్పుడు బంగార్రాజు సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది.

బంగార్రాజు సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన‘ సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సోగ్గాడే చిన్ని నాయన అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది.

 Nagarjuna Bangarraju Movie Latest Interesting Update-బంగార్రాజు లో ఐదుగురు బ్యూటీలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో నాగార్జున నటించిన బంగార్రాజు పాత్రకు మంచి గుర్తింపు లభించింది.అందుకే ఇప్పుడు అదే పేరుతొ సినిమా చేయబోతున్నాడు.

ఇక ఈ సినిమాలో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు.

అయితే తాజాగా వినిపిస్తున్న బజ్ ఏంటంటే ఈ సినిమాలో ఐదుగురు బ్యూటీలు నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి ని అధికారికంగా ప్రకటించారు.

ఇక రమ్య కృష్ణ కూడా తన పాత్రను కంటిన్యూ చేయబోతున్నట్టు ఈ మధ్యనే పోస్టర్ ప్రకటించడంతో ఆమె కూడా కన్ఫర్మ్ అయ్యింది.

అయితే ఈ సినిమాలో రమ్య కృష్ణ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందట.

కానీ ఆ లోటును మిగతా అందగత్తెలు భర్తీ చేయనున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో స్వర్గం లో చాలా సన్నివేశాలు ఉంటాయట.

ఎక్కువ భాగం స్వర్గం లోని సన్నివేశాలే ఉంటాయట.అక్కడ నుండి బంగార్రాజు భూమి మీదకు వచ్చిన తర్వాత కూడా రంభ, ఊర్వశి, మేనక ఆయన వెనకనే వస్తారట.

Telugu Bangarraju, Director Kalyan Krishna, Krithi Shetty, Meenakshi Chaudhary, Monal Gajjar, Naga Chaitanya, Nagarjuna, Nagarjuna Bangarraju Movie Latest Interesting Update, Ramya Krishnan, Soggade Chinni Nayana Sequel, Vedhika-Movie

అందుకే వీరి పాత్రలు కూడా ఈ సినిమాలో కీలకం కాబోతున్నాయి.ఇక అక్కినేని హీరోలు ఇద్దరు ఈ అందగత్తెలతో రొమాన్స్ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.ఈ సినిమాలో కూడా కళ్యాణ్ కృష్ణ ఎమోషన్, రొమాన్స్ కలగలిపి మంచి కమర్షియల్ సినిమాను తెరకెక్కించ బోతున్నట్టు తెలుస్తుంది.ఇక ఇప్పటికే బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ కూడా ఎంపిక చేయడం జరిగింది.

ఈమె కూడా చాలా కీలక పాత్రలో నటిస్తుందట.ఇక వేదిక, మీనాక్షి చౌదరి లను కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం అందుతుంది.

ఇక ఈ ఐదుగురు బ్యూటీలు ఈ సినిమాలో ఎలాంటి రంగులు అద్దుతారో వేచి చూడాల్సిందే.

#Nagarjuna #Ramya Krishnan #Naga Chaitanya #Bangarraju #Kalyan Krishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు