సంక్రాంతి రేస్.. 'బంగార్రాజు' కూడా బరిలోకి దిగుతున్నాడా ?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం బంగార్రాజు సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.

 Nagarjuna Bangarraju Movie Entry Into Sankranthi 2022 Race-TeluguStop.com

నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది.ఈ సినిమాలో నాగార్జున చేసిన ‘బంగార్రాజు’ పాత్రకు అదిరిపోయే స్పందన వచ్చింది.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ మధ్యనే ఆశిషోర్ సోలమన్ డైరెక్షన్ లో ఆయన నటించిన ‘వైల్డ్ డాగ్‘ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Nagarjuna Bangarraju Movie Entry Into Sankranthi 2022 Race-సంక్రాంతి రేస్.. బంగార్రాజు’ కూడా బరిలోకి దిగుతున్నాడా -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున, దియా మీర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో వెంటనే నాగార్జున ఈ సినిమా లైన్ చేస్తున్నాడు.

Telugu Bangarraju, Bangarraju Release Date, January 15, Krithi Shetty, Naga Chaitanya, Nagarjuna, Nagarjuna Bangarraju Movie Entry Into Sankranthi 2022 Race, Ramya Krishna, Sankranthi 2022, Sankranthi 2022 Race-Movie

బంగార్రాజు సినిమాను ఆగస్టు 20 న సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రత్యేక మైన సెట్స్ కూడా వేస్తున్నారని తెలుస్తుంది.ఈ సినిమా అన్నపూర్ణ బ్యానర్ పై తెరకెక్కుతుంది.ఈ సినిమాలో నాగ చైతన్య కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడని టాక్.ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్య కృష్ణ నటిస్తుండగా.నాగ చైతన్య కు జోడీగా కృతి శెట్టి కన్ఫర్మ్ అయ్యింది.

Telugu Bangarraju, Bangarraju Release Date, January 15, Krithi Shetty, Naga Chaitanya, Nagarjuna, Nagarjuna Bangarraju Movie Entry Into Sankranthi 2022 Race, Ramya Krishna, Sankranthi 2022, Sankranthi 2022 Race-Movie

అయితే ఈ సినిమా ఇంకా మొదలు కాకుండానే విడుదల గురించి చర్చ జరుగుతుంది.ఈ సినిమా సంక్రాంతి రేస్ లో రాబోతుందని టాక్.గ్యాప్ లేకుండా షూటింగ్ చేసి ఈ సినిమాను జనవరి 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని చెప్పుకుంటున్నారు.అయితే ఇప్పటికే సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా నాగార్జున విడుదల చేస్తే ఈ సినిమా హిట్ టాక్ వచ్చిన వసూళ్లు అంతగా ఉండవని అంటున్నారు.

మరి చూడాలి నాగార్జున ఏ ప్లాన్ లో ఉన్నాడో.

#Ramya Krishna #Bangarraju #Nagarjuna #January #Krithi Shetty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు