బంగార్రాజు పట్టాలెక్కకుండానే రికార్డ్‌ దక్కించుకునేలా ఉంది

అక్కినేని నాగార్జున డబుల్‌ రోల్‌ లో నటించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా ఏళ్లు అవుతోంది.ఆ సినిమా వచ్చిన సమయంలోనే బంగార్రాజు పాత్రను బేస్‌ చేసుకుని అదే టైటిల్‌తో సినిమా చేయాలని నాగార్జున భావించాడు.

 Nagarjuna Bagarraju Create The World Record With Out Shooting,  Bangarraju, Naga-TeluguStop.com

అందుకోసం కథను సిద్దం చేయాల్సిందిగా దర్శకుడి కళ్యాణ్‌ కృష్ణకు సూచించాడు.ఆయన ఎన్నో కథలు వినిపించాడు.

కాని ఇప్పటి వరకు నాగ్‌ ఏ ఒక్క స్క్రిప్ట్‌కు ఓకే చెప్పలేదు.ఎప్పుడు ఓకే చెప్తాడో కూడా తెలియడం లేదు.

నాగార్జున అసలు బంగార్రాజు చేస్తాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇటీవల ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో సినిమాకు కమిట్‌ అవ్వడంతో బంగార్రాజు సినిమాను క్యాన్సిల్‌ చేసినట్లే అనుకున్నారు.

కాని ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.గత అయిదు సంవత్సరాలుగా బంగార్రాజుకు సంబంధించిన వార్తలు మీడియాలో వస్తూనే ఉన్నాయి.

బంగార్రాజు చిత్రం షూటింగ్‌ ప్రారంభం కాకుండా అయిదు ఏళ్లుగా మీడియాలో నానుతున్న కారణంగా దీనికి సరికొత్త రికార్డు నమోదు అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.బంగార్రాజు చిత్రం విషయంలో గతంలో ఏ సినిమాకు జరగని విధంగా చర్చ జరుగుతోంది.

కనుక ఇది అరుదైన రికార్డుగా అక్కినేని ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.మరో అయిదు సంవత్సరాల వరకు బంగార్రాజు ఇలాగే చర్చ జరుగుతుంది పట్టాలెక్కదేమో అంటూ కొందరు ట్రోల్స్‌ చేస్తున్నారు.

ఇప్పటికైనా పట్టాలెక్కిస్తే బాగుంటుంది.లేదంటే ఆ ప్రాజెక్ట్‌ను వదిలేస్తున్నామని ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube