బిగ్‌బాస్‌ 3 అఫిషియల్‌ అనౌన్స్‌ మెంట్‌.... అతడు కన్ఫర్మ్‌  

Nagarjuna As Bigg Boss Telugu Host For Season 3-

తెలుగు బిగ్‌ బాస్‌ మూడవ సీజన్‌ హోస్ట్‌ ఎవరు అనే విషయమై క్లారిటీ వచ్చేసింది. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌, రెండవ సీజన్‌కు నాని హోస్ట్‌లుగా వ్యవహరించిన విషయం తెల్సిందే. ఇప్పుడు మూడవ సీజన్‌లో వారిద్దరు కూడా అందుబాటులో లేకపోవడంతో పదుల సంఖ్యలో పేర్లు పరిశీలించారు, ప్రస్థావించారు..

బిగ్‌బాస్‌ 3 అఫిషియల్‌ అనౌన్స్‌ మెంట్‌.... అతడు కన్ఫర్మ్‌-Nagarjuna As Bigg Boss Telugu Host For Season 3

ఎంతో మందితో చర్చలు జరిపారు. కాని ఏ ఒక్కరిని కూడా ఫైనల్‌ చేయలేదు. మరో వారం రోజుల్లో బిగ్‌బాస్‌ సీజన్‌ 3 అధికారిక ప్రకటనను మాటీవీలో చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాటీవీలో జులై నుండి ఈ షో ప్రారంభం కాబోతుంది.

అధికారిక ప్రకటనకు రెడీ అయిన షో నిర్వాహకులు ఇప్పటికే నాగార్జునతో ఢీల్‌ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 3కి హోస్ట్‌గా నాగార్జున అంటూ ఫైనల్‌ అయ్యింది. అయితే నాగార్జున ఈ విషయమై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. మీలో ఎవరు కోటీశ్వరుడు రెండు సీజన్‌లను విజయవంతంగా నిర్వహించిన నాగార్జున బిగ్‌బాస్‌ మూడవ సీజన్‌కు మంచి హోస్ట్‌ అవుతాడు అంటూ నమ్మకంగా చెబుతున్నారు.

తప్పకుండా నాగార్జున ఉంటే బిగ్‌బాస్‌ సాఫీగా సాగుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

బిగ్‌బాస్‌ హోస్ట్‌గా గతంలో చేసిన ఎన్టీఆర్‌ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత నాని చేసి అంతగా మెప్పించలేక పోయాడు. అయితే ఇంట్లో ఉండే సభ్యులు అంతా కూడా గౌరవించే వ్యక్తినే హోస్ట్‌గా ఉంచాలి అనేది నిర్వాహకుల ఆలోచన.

అందుకే సల్మాన్‌ ఖాన్‌ వంటి స్టార్‌ అయిన నాగార్జున తెలుగు బిగ్‌బాస్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తే బాగుంటుందనే అభిప్రాయంకు వచ్చారు. మరి ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంటుంది. బిగ్‌బాస్‌ 3 సీజన్‌ యాడ్‌ను వారం రోజుల్లో మాటీవీలో ప్రసారం చేయబోతున్నారు.