బ్రహ్మాస్త్ర భారం నాగ్ కంటే రాజమౌళి పైనే ఎక్కువ ఉందట!

బాలీవుడ్ లో తెరకెక్కిన మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్‌ బ్రహ్మాస్త్ర విడుదలకు సిద్ధం అయ్యింది.

వచ్చే వారం లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బ్రహ్మాస్త్ర సినిమా లో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

నాగార్జున నటించిన కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కు భారీ ఎత్తున క్రేజ్ అయితే దక్కింది అనడంలో సందేహం లేదు.కానీ బ్రహ్మాస్త్ర తెలుగు లో వసూలు చేయడం కేవలం రాజమౌళి చేతి లోనే ఉంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా యొక్క పూర్తి భారం రాజమౌళి చేతుల్లో చిత్ర సభ్యులు పెట్టారు.సినిమా తెలుగు వర్షన్ ని రాజమౌళి తెలుగు ప్రేక్షకులకు సమర్పిస్తున్న విషయం తెలిసిందే.

ఆయన సమర్పిస్తున్న కారణంగా సినిమా లో మ్యాటర్ ఉంటుందని తప్పకుండా పైసా వసూల్ సినిమా అవుతుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నాగార్జున నటించినా కూడా రాజమౌళి సమర్పిస్తున్నాడు అనే ఉద్దేశంతోనే ఎక్కువ శాతం మంది సినిమా యొక్క టికెట్లను బుక్ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది.

Advertisement

రణబీర్ కపూర్, ఆలియా జంటగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని రాజమౌళి చాలా నమ్మకం తో చెబుతున్నాడు.

నాగార్జున ఈ సినిమా విషయం లో ఎలా ఉన్నాడు అనేది ఆయన మాటల ద్వారా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కాబోతున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నాయి.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ను ఒక తెలుగు స్టార్ హీరో సినిమా రేంజ్ లో ప్రమోట్ చేశారు.

అదే స్థాయి లో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు థియేటర్లని బుక్ చేశారని సమాచారం అందుతుంది సినిమా కు పెద్ద సినిమా ల నుండి పోటీ లేక పోవడం వల్ల తప్పకుండా మంచి ఫలితాలు నమోదు అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు