తండ్రి దారిలో తనయుడు కూడా.. చైతూ నుండి కీలక అప్‌డేట్

అక్కినేని హీరో నాగార్జున ఇటీవలే తాను ఓటీటీ కంటెంట్‌ చేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు.అది వెబ్‌ సిరీస్ అయ్యి ఉంటుందని కొందరు.

 Nagarjuna And Naga Chaitanya Going To Ott-TeluguStop.com

లేదు వెబ్‌ మూవీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మంచి ఐడియాను డెవలప్‌ చేస్తున్నట్లుగా నాగార్జున చెప్పుకొచ్చాడు.

వచ్చే ఏడాదిలో నాగార్జున ఓటీటీ ఎంట్రీ ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.ఈ సమయంలోనే తెలుగు నుండి మరి కొందరు హీరోలు వెబ్‌ సిరీస్ లు ఓటీటీ మూవీస్ చేసేందుకు ముందుకు వస్తున్నారు.

 Nagarjuna And Naga Chaitanya Going To Ott-తండ్రి దారిలో తనయుడు కూడా.. చైతూ నుండి కీలక అప్‌డేట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాగార్జున తనయుడు నాగ చైతన్య కూడా ఓటీటీ ఎంట్రీకి సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.శరత్‌మరార్ నిర్మాణంలో ప్రముఖ ఓటీటీ కోసం ఈయన నటించేందుకు ఓకే చెప్పాడు.

అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట.

నాగచైతన్య ఇప్పటికే నటించిన లవ్‌ స్టోరీ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.

మరో వైపు థ్యాంక్యూ కూడా విడుదల కోసం వెయిట్‌ చేస్తుంది.ఇక హిందీలో అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్‌ సింగ్‌ చద్దా సినిమా లో కూడా ఈయన నటిస్తున్నట్లుగా ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యింది.

ఈ మూడు సినిమాలు కాకుండా మరో మూడు సినిమాలు కూడా చైతూ చేస్తున్నాడు.వరుసగా సినిమాలు చేయడంతో పాటు ఓటీటీ కంటెంట్‌ లో కూడా నటించేందుకు సిద్దం అవ్వడం పట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Film News, Laal Singh Chadda, Movie News, Naga Chaitanya, Naga Chaitanya Web Series, Nagarjuna, Producer Sharath Maraar, Samantha, Tollywood, Web Movie, Web Series-Movie

ముఖ్యంగా నాగచైతన్య చేయబోతున్న ఓటీటీ కంటెంట్‌ ఏంటా అంటూ అంతా చర్చించుకుంటున్నారు.ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 ద్వారా ఓటీటీ కి సమంత ఎంట్రీ ఇచ్చింది.ఇప్పుడు ఆమె భర్త ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయ్యాడు.ఇది మంచి పరిణామం అంటూ అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగ చైతన్య ఓటీటీ కంటెంట్‌ తో సూపర్‌ హిట్‌ లను అందుకుంటాడా చూడాలి.

#Samantha #Web #Nagarjuna #Sharath Maraar #Web

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు