ఆంక్షలు అవరోధాలు ఎన్ని ఎదురైనా 'బంగార్రాజు' దిగుడేనట

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున మరియు ఆయన తనయుడు నాగ చైతన్య కలిసి బంగార్రాజు చిత్రంలో నటించారు.ఆ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.

 Nagarjuna And Naga Chaitanya Bangarraju Movie Not Postpone Any Way Details, Naga-TeluguStop.com

ఈ సంక్రాంతికి విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.భారీ అంచనాల నడుమ రూపొందిన బంగార్రాజు సినిమా లో నాగార్జున మరియు నాగ చైతన్యలు ఇద్దరు కూడా బంగార్రాజు పాత్రల్లో కనిపించబోతున్న విషయం తెల్సిందే.

రికార్డు స్థాయిలో ఈ సినిమా వసూళ్లు నమోదు చేస్తుందని అంతా అనుకుంటున్నారు.ఎందుకంటే సంక్రాంతికి వస్తామని చెప్పిన ఆర్ ఆర్‌ ఆర్ మరియు రాధేశ్యామ్‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కు రాకుండానే తప్పుకున్నాయి.

దాంతో సంక్రాంతికి నాగార్జున మరియు నాగ చైతన్యలు బంగార్రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఆ రెండు సినిమాలు కూడా రాక పోవడం తో బంగార్రాజు సినిమానే జనాలు అంతా చూడాల్సిన పరిస్థితి.

దాంతో బంగార్రాజు ఈజీగా వంద కోట్లు అంటూ వార్తలు వస్తున్నాయి.అయితే ఈ సమయంలో తెలుగు రాష్ట్రల్లో కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రభావం తక్కువే ఉంది.కాని ఇదే పరిస్థితి వారం రోజుల తర్వాత ఉంటుందని అనిపించడం లేదు.ఎందుకంటే పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.

ఖచ్చితంగా సినిమా కు కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రభావం ఉంటుందని అంటున్నారు.

Telugu Bangarraju, Corona Wave, Covid, Krithi Shetty, Naga Chaitanya, Nagarjuna,

ఇప్పటికే ఆంక్షలు కూడా ఏపీలో మొదలు అయ్యాయి.తెలంగాణలోనూ ఆంక్షలు తప్పక పోవచ్చు.అయినా కూడా బంగార్రాజు తగ్గేది లేదు అన్నట్లుగా దూసుకు పోతున్నాడు.

బంగార్రాజు సినిమా విడుదల అయిన వారం రోజుల పాటు పరిస్థితులు అనుకూలిస్తే చాలు మొత్తం సెట్‌ అయిపోతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

సినిమాలో ఆమె ఒక పోలిటికల్ ఉమెన్ గా కనిపించబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube