నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా లోని బంగార్రాజు పాత్ర ఆధారంగా ఒక సినిమాను చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఆ సినిమా షూటింగ్ అదుగో ప్రారంభం ఇదుగో ప్రారంభం అంటూ ముడు సంవత్సరాలుగా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు.
బంగార్రాజు పాత్ర ఆధారంగా సినిమా కథను రాయాలంటే చాలా సమయం పట్టింది.పదుల వర్షన్ ల కథలు రాసుకున్న తర్వాత చివరకు కథను ఓకే చేశారు.
అయితే అది కాస్త మల్టీ స్టారర్ అంటూ వార్తలు రావడంతో కొందరు అనుమనాలు వ్యక్తం చేశారు.కొందరు నిజం కాకపోయి ఉంటుంది అంటూ అనుమానంగా చూశారు.
కాని చివరకు సినిమా మాత్రం నిజంగానే అంటూ నేడు అధికారికంగా ప్రకటించడంతో పాటు షూటింగ్ కార్యక్రమాలు కూడా మొదలు అయ్యాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బంగార్రాజు సినిమాలో నాగార్జున మరియు నాగచైతన్యలు తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారు.వీరి ఇద్దరి పాత్రలు కూడా ది బెస్ట్ అన్నట్లుగా ఉండబోతున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.నాగార్జున సోగ్గాడు లో నటించినట్లుగానే బంగార్రాజు పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇక చైతూ ఆయన తనయుడిగా కనిపించేందుకు సిద్దం అవుతున్నాడు.తండ్రి కొడుకులు కలిసి ఇప్పటికే మనం సినిమాలో నటించారు.
ఇప్పుడు మరో సారి కలిసి బంగార్రాజు లో నటించేందుకు సిద్దం అయ్యారు.వచ్చే ఏడాది సమ్మర్ లో బంగార్రాజు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
వరుసగా వస్తున్న సినిమాలతో బంగార్రాజు కాస్త ఆలస్యం అవుతుందని కూడా సమాచారం అందుతోంది.బంగార్రాజు సినిమాలో చైతూకు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించబోతుంది.
ఇక నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుందని మొన్నటి వరకు అన్నారు.కాని ఆ పాత్రను శ్రియ చేస్తుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
త్వరలోనే క్లారిటీ వస్తుందని అంతా ఆశిస్తున్నారు.