అక్కినేని మల్టీస్టారర్.. ఈసారి నాగార్జున-అఖిల్.. ఆ డైరెక్టర్ మాస్ స్కెచ్..

ఏఎన్నార్ వేసిన పునాది పైనే అక్కినేని తరాలు నడుస్తున్నాయి.ఏఎన్నార్ తర్వాత నాగార్జున అంతటి గొప్ప ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

 Nagarjuna And Akhil In A Multi Starrer With Mohan Raja, Akkineni Family, Akhil,-TeluguStop.com

ఈయన క్లాస్ సినిమాలతో పాటు మాస్ సినిమాలు కూడా చేసి స్టార్ హీరోగా మన్మధుడుగా ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు.ఇక ఈయన తర్వాత ఈయన వారసులు కూడా సినీ ప్రపంచం లోకి అడుగు పెట్టారు.

నాగ చైతన్య ఇప్పటికే వరుస హిట్స్ తో ఫుల్ జోష్ గా తన కెరీర్ కొనసాగిస్తున్నాడు.ఈయన తన తండ్రితో కలిసి మల్టీ స్టారర్ సినిమా కూడా చేసాడు.

ఇక ఇప్పుడు ఈ అక్కినేని హీరోలు మరో మల్టీ స్టారర్ కు రెడీ అవుతున్నారు అనే మాట ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.అయితే ఈసారి నాగ చైతన్య- నాగార్జున కాకుండా నాగార్జున- అఖిల్ కలిసి మల్టీ స్టారర్ చేయబోతున్నారు అని టాక్.

అది కూడా తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో ఈ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.నాగ్ ప్రెజెంట్ ది గోస్ట్ సినిమా చేస్తుండగా.

అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు.ఇక ఇప్పుడు వీరిద్దరూ కలిసి మల్టీ స్టారర్ చేయబోతున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి.

Telugu Akhil, Akkineni, Chiranjeevi, Mohan Raja, Naga Chaitanya, Nagarjuna, Ghos

మోహన్ రాజా ఒక డిఫరెంట్ ఇన్నోవేటివ్ స్టోరీ రెడీ చేసినట్టు ఇప్పటికే ఈ అక్కినేని హీరోలకు వినిపించినట్టు కూడా టాక్.మోహన్ రాజా ప్రెజెంట్ చిరంజీవి తో గాడ్ ఫాథర్ సినిమా చేస్తున్న విషయం విదితమే.ఈ క్రమంలోనే అక్కినేని మల్టీ స్టారర్ కథ విషయంలో కూడా చిరు కీలక పాత్ర పోషించినట్టు కథనాలు వస్తున్నాయి.మోహన్ రాజా చిరుకి స్టోరీ లైన్ చెప్పగా ఆయన నాగార్జున ను అఖిల్ పేర్లను సజెస్ట్ చేశారట.

చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube