రైతుల కోసం నాగ్‌, అమల ఏం చేశారో తెలుసా?

అక్కినేని ఫ్యామిలీ సేవా గుణంలో ఉన్నతులు అంటూ ఫ్యాన్స్‌ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు.అమలా అక్కినేని ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది.

 Akkineni Family, Nagarjuna,amala,free Seeds Distribution, Farmers-TeluguStop.com

ముఖ్యంగా ఆమె మూగ జీవుల కోసం పాటు పడే విధానం అందరిని ఆకట్టుకుంటుంది.ఆమె ఎన్నో సార్లు మూగ జీవాల కోసం కష్టపడ్డ విషయం తెల్సిందే.తాజాగా మరోసారి రైతుల కోసం అక్కినేని కుటుంబం తరపున అమలా మరియు నాగార్జున గారు విత్తనాలు సరఫరా చేశారు.

650 మంది రైతులకుగాను నాగార్జున అమల గారు కంది విత్తనాలను పంపిణీ చేశారు.ఈ విషయాన్ని స్వయంగా అమలా పేర్కొన్నారు.ఈ సమయంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేయడం అంటే చాలా మంచి విషయం.ఈ పని చేస్తున్నందుకు నిజంగా అమలా అక్కినేని గారిని అభినందించాల్సిందే.వారు కొంత మందికే విత్తనాలు పంపిణీ చేసినా కూడా చాలా మందికి ఆదర్శంగా నిలిచారు అనడంలో సందేహం లేదు.

వర్షాలు పడుతున్న ఈ సమయంలో రైతులు పంటలు వేసుకునేందుకు అప్పు సొప్పు చేసి విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తుంది.అలాంటి వారికి విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయడంతో వారు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకునే వీలుంటుందని ఈ సందర్బంగా నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అక్కినేని ఫ్యామిలీ చేసిన పనిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు స్టార్స్‌ కూడా ఇలాగే రైతులకు సాయం చేయాలనే డిమాండ్‌ వ్యక్తం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube