చైసామ్ విడాకులపై మరోసారి స్పందించిన నాగ్.. అవి చెత్తవార్తలు అంటూ?

సెలబ్రిటీ జంట చైతన్య సమంత విడాకులు అభిమానులను ఎంతగానో బాధ పెట్టిన సంగతి తెలిసిందే.చైసామ్ విడిపోయారనే వార్తను అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

 Nagarjuna Akkineni Bashes News Reports On Family Amid Chaitanya Separation From Samantha , Nagachaitanya, Nagarjuna, Samantha, Separation-TeluguStop.com

చైతన్య సమంత విడిపోయిన సమయంలో అసలు కారణాలు వెల్లడించకపోవడంతో వీళ్లిద్దరికీ సంబంధించి అనేక వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి.సమంత బోల్డ్ రోల్స్ చేయడం వల్లే చైసామ్ విడిపోయారని జోరుగా ప్రచారం జరిగింది.

కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు చైసామ్ విడాకులకు సంబంధించి ఫేక్ వార్తలను సైతం ప్రచారం చేశాయి.అయితే తాజాగా నాగార్జున మరోసారి చైతన్య సమంత విడాకుల సమయంలో వైరల్ అయిన వార్తల గురించి తనదైన శైలిలో స్పందించారు.

 Nagarjuna Akkineni Bashes News Reports On Family Amid Chaitanya Separation From Samantha , Nagachaitanya, Nagarjuna, Samantha, Separation-చైసామ్ విడాకులపై మరోసారి స్పందించిన నాగ్.. అవి చెత్తవార్తలు అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొంతమంది కావాలనే చెత్తవార్తలను సృష్టిస్తున్నారని నాగార్జున అన్నారు.కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ఎక్కువగా ఈ తరహా వార్తలను ప్రచారం చేస్తున్నాయని నాగ్ వెల్లడించారు.

నా గురించి ఫేక్ వార్తలను ప్రచారం చేసినా తాను ఆ వార్తలను పెద్దగా పట్టించుకోలేదని నాగ్ చెప్పుకొచ్చారు.పండ్లు ఉండే చెట్టుకే రాళ్ల దెబ్బలు అని తాను భావిస్తానని నాగార్జున కామెంట్లు చేశారు.

ఈ కారణం వల్లే నా గురించి ఎలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తలను తాను పట్టించుకోనని నాగ్ చెప్పుకొచ్చారు.అయితే ఫ్యామిలీ గురించి రాసిన నెగిటివ్ వార్తలు మాత్రం నన్ను బాధించాయని నాగ్ అన్నారు.

Telugu Nagarjuna, Samantha-Movie

ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ నాగార్జున ఈ విషయాలను వెల్లడించారు.ఆ తర్వాత నాగచైతన్య మాట్లాడుతూ తన గురించి వైరల్ అయ్యే ఫేక్ వార్తలను తాను పెద్దగా పట్టించుకోనని కామెంట్లు చేశారు.బంగార్రాజు సినిమా మరో నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్లు సాధిస్తే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది.ఈ వీకెండ్ నాటికి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube