బ్యాచ్‌లర్‌ను చూసి మురిసిపోతున్న నాగ్  

Nagarjuna Happy With Most Eligible Bachelor Output, Nagarjuna, Most Eligible Bachelor, Akhil Akkineni, Pooja Hegde, Bommarillu Bhasker - Telugu Akhil Akkineni, Bommarillu Bhasker, Most Eligible Bachelor, Nagarjuna, Pooja Hegde

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు అక్కినేని హీరో.

TeluguStop.com - Nagarjuna Akhil Most Eligible Bachelor

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇక తన కొడుకు ఈ సినిమాతోనైనా తొలి కమర్షియల్ హిట్ అందుకుంటాడేమో అనే ఆసక్తితో ఉన్నాడు కింగ్ నాగార్జున.అఖిల్ చేసే ప్రతి సినిమాను పరిశీలించే నాగ్, ఈ సినిమాను కూడా తనదైన పద్ధతిలో పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా రషెస్‌ను చూసిన నాగ్, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన తీరుతో పూర్తి సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.పూర్తి యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన తీరు బాగుందని ఆయన భావిస్తున్నాడట.

ఇక ఈ సినిమాలో అఖిల్ తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని నాగ్ ఆశిస్తున్నాడు.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ కావడంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అటు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌కు కూడా ఈ సినిమా చాలా కీలకం కావడంతో, ఆయన ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటున్నాడట.కాగా ఈ సినిమాలో అఖిల్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండటంతో, ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక రొటీన్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా కాకుండా, ఈ సినిమాను వైవిధ్యమైన కధాంశంతో దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.మరి ఈ సినిమాతో అఖిల్ నిజంగా సక్సెస్ అందుకుంటాడా లేక ఇది కూడా ఆయన ఫ్లాపుల జాబితాలో చేరుతుందా అనేది సినిమా రిలీజ్ తరువాతే తెలుస్తోంది.

#Pooja Hegde #Akhil Akkineni #MostEligible #Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nagarjuna Akhil Most Eligible Bachelor Related Telugu News,Photos/Pics,Images..