'వైల్డ్‌ డాగ్‌' సినిమాలో పాటలు లేకున్నా అవి కావాల్సినంత ఉన్నాయి

నాగార్జున నటించిన వైల్డ్‌ డాగ్‌ సినిమా ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఎన్ ఐ ఏ ఏజెంట్‌ విజయ్ పాత్రలో నాగార్జున కనిపించబోతున్న విషయం తెల్సిందే.

 Nagarjuna About Wild Dog Movie , Film News ,film News In Telugu ,nagarjuna ,telu-TeluguStop.com

ఈ సినిమా లో కథానుసారం పాటలు ఉండవని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ఈ సినిమా పై ఉన్న అంచనాల నడుమ పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలుగు ఆడియన్స్‌ ఎక్కువగా కమర్షియల్‌ సినిమాలను మాత్రమే ఇష్టపడతారు.పాటలు, ఫైట్ లు కామెడీ సన్నివేశాలు లేకుండా సినిమాకు ఒప్పుకోరు అనడంలో సందేహం లేదు.

అలాంటి తెలుగు ప్రేక్షకుల ముందుకు వైల్డ్‌ డాగ్‌ పాటలు లేకుండా వస్తే ఎలా ఉంటుందని మొదటి నుండి బయ్యర్లు కాస్త భయంను వ్యక్తం చేస్తున్నారు.తాజాగా నాగార్జున ఆ విషయమై క్లారిటీ ఇచ్చాడు.

వైల్డ్‌ డాగ్ సినిమా కథలో పాటలు పెట్టడం వల్ల ఫీల్‌ మిస్ అవుతుంది.అందుకే పాటలను పెట్టానుకోలేదు.కాని సినిమా లో ఉండే ఎంటర్‌ టైన్ మెంట్‌ సన్నివేశాలు తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.రొమాంటిక్ సీన్స్‌ సినిమాలో చాలానే ఉంటాయి.

అలాగే సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేసే విధంగా ఉంటాయని ఈ సందర్బంగా నాగ్ పేర్కొన్నారు.పాటలు లేనంత మాత్రాన ఇది కమర్షియల్ సినిమా కాకుండా పోదు అంటూ ఆయన చెప్పిన విషయం ప్రస్తుతం బయ్యర్లతో పాటు ప్రేక్షకుల్లో కూడా కాస్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తప్పకుండా ఈ సినిమా మెప్పిస్తుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేస్తున్నారు.నాగార్జున ఈ సినిమా లో మరీ వైలెంట్ గానే కాకుండా రొమాంటిక్ గా కూడా ఉంటాడని ట్రైలర్ చూస్తుంటే అర్థం అయ్యింది.

 సొలోమన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాకిస్తాన్‌ ఉగ్రవాదుల నేపథ్యంలో సాగుతోందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube