బంగార్రాజు మళ్లీ పాత పాటే పాడుతున్నాడు.. ఇంకా ఎన్నాళ్లు బాసు ఇది?

నాగార్జున, లావణ్య త్రిపాఠి జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా లోని బంగార్రాజు పాత్రతో ఒక సినిమాను చేయాలని నాగార్జున భావించాడు.ఆ పాత్ర చుట్టు కథను అల్లుతూ సినిమాను రూపొందించే పనిని దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణకు అప్పగించడం జరిగింది.

 Nagarjuna About Bangarraju Movie , Bangarraju, Nagarjuna, Telugu Flim, Telugu Fl-TeluguStop.com

నాగార్జున మరియు కళ్యాణ్‌ కృష్ణ కాంబోలో ఆ సినిమా గురించి గడచిన నాలుగు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది.ఏదో ఒక కారణం వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది.

ఎట్టకేలకు సినిమా ప్రారంభం అయ్యిందని రెండు నెలల క్రితం ప్రచారం జరిగింది.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు బంగార్రాజు కథను పూర్తి చేయలేదు.

షూటింగ్‌ ప్రారంభంకు ఇంకా సమయం పడుతుందని క్లారిటీ ఇచ్చారు.మొత్తానికి బంగార్రాజు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది పరిస్థితి అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

బంగార్రాజు సినిమాతో నాగార్జు ఖచ్చితంగా సక్సెస్ అందుకుంటాడని ఆయన్ను ఆ పాత్రలో ప్రేక్షకులు చూడాలనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.కాని నాగార్జున మాత్రం ఇటీవల వైల్డ్‌డాగ్ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ బంగార్రాజు సినిమా గురించి స్పందించాడు.

ఇప్పటి వరకు కథ విషయంలో తుది నిర్ణయానికి రాలేదు అన్నాడు.షూటింగ్‌ ప్రారంభం అయ్యింది, రమ్యకృష్ణ నటించబోతుంది అంటూ వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చాడు.

మరి ఈ ఏడాదిలో అయినా బంగార్రాజు ఉంటుందా అంటూ ప్రశ్నించగా కథ సిద్దం అయితే తప్పకుండా సినిమాను చేసేందుక సిద్దంగా నాగార్జున ఉన్నట్లుగా చెబుతున్నారు.అసలు బంగార్రాజు సినిమా కథ పూర్తి అయ్యేది ఎప్పుడు అంటూ నెటిజన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

  వైల్డ్‌ డాగ్ తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమాను నాగ్ చేయబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube